Gold Rate Today: అక్షయ తృతీయ రోజు భారీగా తగ్గిన బంగారం ధర... ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
Gold Rate Today: బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: ఏప్రిల్ 30వ తేదీన పసిడి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,980గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,810గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ.1,10,900గా ఉంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాణిజ్య పరిస్థితులే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
ప్రధానంగా అమెరికా స్టాక్ మార్కెట్లలో లాభాలు బంగారం ధరలు తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు డాలర్ బలంగా మారడం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి డాలర్ అనేది కీలకం అని చెప్పవచ్చు. డాలర్ బలహీనంగా మారితే బంగారం ధర ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇన్వెస్టర్లు డాలర్ పైన నమ్మకం కోల్పోయినట్లయితే తమ పెట్టుబడులను సేఫ్ గా బంగారంలో పెట్టుబడి పెడుతూ ఉంటారు.
ఒకవేళ డాలర్ మళ్ళీ పుంజుకుంటే తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల పై పెట్టుబడి పెడుతుంటారు. అప్పుడు వారికి ట్రెజరీ బాండ్ల పై రాబడి అధికంగా లభిస్తుంది. అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు తగ్గడం పట్ల పసిడి ప్రియులకు కాస్త ఊరట కల్పిస్తున్నప్పటికీ ఇంకా ఆల్ టైం రికార్డ్ స్థాయికి సమీపంలోనే ఉన్నాయి.
గత ఏడాది ఇదే అక్షయ తృతీయకు బంగారం ధర దాదాపు 70 వేల రూపాయల సమీపంలోనే ఉంది. కానీ ఈ అక్షయ తృతీయ మాత్రం బంగారం ధర ఏకంగా 1,00,000 సమీపానికి చేరుకుంది. ఇంత వేగంగా బంగారం ధర ఎప్పుడు పెరగలేదని నిపుణులు పేర్కొంటున్నారు. పెద్ద బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే అంచనాలు ప్రస్తుతం ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి టారిఫ్ వార్ వంటి వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గినట్లయితే, బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.