Petrol Price Hike: వామ్మో.. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా?.. ఇరాన్,ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ మనపైన పడుతుందా?

Petrol Price Hike: ఏంటో ఎక్కడ గొడవ జరిగినా మనకే చుట్టుకుంటుందన్నట్టు.. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మన దేశంలో కొన్ని ఉత్పత్తుల రేట్లు భారీగా పెరిగిపోనున్నాయి.

Update: 2025-06-14 08:55 GMT

Petrol Price Hike: వామ్మో.. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా?.. ఇరాన్,ఇజ్రాయిల్ యుద్ధం ఎఫెక్ట్ మనపైన పడుతుందా?

Petrol Price Hike: ఏంటో ఎక్కడ గొడవ జరిగినా మనకే చుట్టుకుంటుందన్నట్టు.. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మన దేశంలో కొన్ని ఉత్పత్తుల రేట్లు భారీగా పెరిగిపోనున్నాయి. ముఖ్యంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి. దీంతో ఇక పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఒక లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు పైన ఉంది. ఇప్పుడు దీని రేటు పెరిగితే ఇక సామాన్యుడు వాహనాల్లో ఎలా తిరగగలుగుతాడు?

అసలు ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుధ్ధం జరిగితే మనకెందుకు ముప్పు? అంటే మనకే కాదు చాలా దేశాలకు అది ముప్పే. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ఆపకపోతే ఎన్నో ఉత్పత్తుల రేట్లు అమాంతం పెరిగిపోతాయి. మన దేశానికి క్రూడ్ అయిల్ ఎక్కువగా పశ్చిమాసియా దేశాల నుంచే వస్తుంది. ముఖ్యంగా అరేబియా సముద్రం ద్వారా ఈ క్రూడ్ ఆయిల్‌ను సరఫరా చేయాలి. అయితే ఇలా సరఫరా చేయాలంటే అరేబియా సముద్రంలో ఓడలు ఫ్రీగా తిరగాలి. కానీ ఈ యుద్ధం వల్ల అక్కడ ఓడలు స్వేచ్ఛగా తిరగలేవు. దీనివల్ల క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోతుంది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయి. మన దేశం ఇరాన్‌తో పాటు సౌదీ, కువైట్, ఇరాక్ వంటి దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ తెప్పించుకుంటుంది. అందువల్లే ఆ దేశాల్లో ఎక్కడ యుద్ధం జరిగినా మనకు ముందే ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్‌లో జరుగుతున్న యుద్ధ వాతావరణం చూస్తే ఇప్పట్లో ఆగేటట్లు ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మన దేశంలో కచ్చితంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బ్రెంట్ ముడి చమురు 9 శాతానికి, బ్యారెల్‌కు 75.61 డాలర్ల కు చేరుకున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్ పైనా ఈ యుధ్ధం ఎఫెక్ట్ పడింది. మరింకెందుకు ఆలస్యం మీ వాహనాల్లో ఎప్పుడూ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని ఉంచుకోండి మరి.

Tags:    

Similar News