Aduri Group: ఆరు మెగా ప్రాజెక్ట్స్ ప్రారంభించిన ఆదూరి గ్రూప్
Aduri Group: శిల్పకళా వేదికలో బ్రోచర్ ఆవిష్కరించిన ... మురళీ మోహన్, చైర్మన్ రామాంజనేయులు
Aduri Group: ఆరు మెగా ప్రాజెక్ట్స్ ప్రారంభించిన ఆదూరి గ్రూప్
Aduri Group: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆదూరి గ్రూప్ ఒకేసారి ఆరు మెగా ప్రాజెక్ట్స్ ని ప్రారంభించింది. మాదాపూర్‌లోని శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదూరి గ్రూప్ నూతనంగా ప్రారంభిస్తున్న "ఆభరణ, డైనమిక్ కౌంటీ, ప్రకృతి హిల్స్ టౌన్ షిప్, మేధా కౌంటీ, త్రిదేవ్ ఎనక్లేవ్, అరోరా హైట్స్ ప్రాజెక్ట్స్ బ్రోచర్ లను సినీ నటుడు మాగంటి మురళి మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఆదూరి చైర్మన్ రామాంజనేయులు, సంస్థ డైరెక్టర్లతో కలిసి ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకి అందుబాటు ధరలో నివాస స్థలం కల్పించాలన్న రామాంజనేయులు ఆశయం నెరవేరాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేసారు.
ఆదూరి చైర్మన్ రామాంజనేయులు మాట్లాడుతూ.... ఓఆర్ఆర్ కి అతి చేరువలో, అందరికి అందుబాటు ధరల్లో హెచ్ఎండిఏ, డీటీసీపీ వెంచర్లను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కామాక్షి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుసుధన్ రెడ్డి, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్లు, డైరెక్టర్లు సంస్థ ఉద్యోగులు, మార్కెటింగ్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.