AC Prices: భారీగా తగ్గిన ఏసీ ధరలు.. వివిధ కంపెనీ ఎయిర్ కండీషనర్‌లపై 50% తగ్గింపు..!
AC Prices: వర్షాకాలం రావడంతో ఏసీ ధరలు పడిపోయాయి. వివిధ కంపెనీల ఎయిర్ కండీషనర్‌లపై దాదాపు 50% తగ్గింపు లభిస్తోంది.
AC Prices: భారీగా తగ్గిన ఏసీ ధరలు.. వివిధ కంపెనీ ఎయిర్ కండీషనర్‌లపై 50% తగ్గింపు..!
AC Prices: వర్షాకాలం రావడంతో ఏసీ ధరలు పడిపోయాయి. వివిధ కంపెనీల ఎయిర్ కండీషనర్‌లపై దాదాపు 50% తగ్గింపు లభిస్తోంది. ఒక మంచి ఏసీ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే అమెజాన్ అద్భుతమైన ఆఫర్‌ని తీసుకొచ్చింది. ఈ సేల్‌లో ఏసీలపై 50% వరకు తగ్గింపును పొందుతారు. ఈ జాబితాలో LG, Voltas, Hitachi ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ఈ కంపెనీల ఏసీలు అద్భుత ఫీచర్లు ద్వారా మిలియన్ల మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. వీటిని వాయిస్, రిమోట్ రెండింటితో సులభంగా కంట్రోల్ చేయవచ్చు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
LG AC
ఎల్‌జీ ఎయిర్ కండీషనర్‌లపై భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ కంపెనీ AC 3 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. ఇది యాంటీవైరస్, HD ఫిల్టర్‌లతో కూడిన సూపర్ కన్వర్టిబుల్ 6-ఇన్-1 కూలింగ్ మోడ్‌ను కలిగి ఉంటుంది. దీని అసలు ధర ₹ 57,990 కానీ అమెజాన్ సేల్‌లో 50% వరకు భారీ తగ్గింపు తర్వాత కేవలం రూ. 28,990కి కొనుగోలు చేయవచ్చు.
Voltas AC
Voltas కంపెనీకి చెందిన ఎయిర్ కండీషనర్ అడ్జస్టబుల్ కూలింగ్ ఫీచర్‌తో వస్తుంది. దీన్ని అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు. దీంతోపాటు స్వచ్ఛమైన గాలి కోసం యాంటీ డస్ట్ ఫిల్టర్‌ను పొందుతారు. ఈ ఎయిర్ కండీషనర్ 3 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. 47% ఆఫర్‌తో దీన్ని కేవలం రూ.31,990కి అమెజాన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.
బ్లూ స్టార్ AC
బ్లూ స్టార్ ఎయిర్ కండీషనర్‌కు 3 స్టార్ రేటింగ్ అందించారు. ఇది 52 డిగ్రీల ఉష్ణోగ్రతలలో కూడా గదిని చల్లబరుస్తుంది. దీంతోపాటు దీని లుక్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది. దీని సామర్థ్యం గురించి చెప్పాలంటే ఇది 1.5 టన్నులు ఉంటుంది. అమెజాన్ సేల్‌లో 30% తగ్గింపుతో కేవలం రూ. 28,999కి కొనుగోలు చేయవచ్చు.