Alert Employees: ఉద్యోగులకి అలర్ట్.. ఈ పథకం కింద 7 లక్షల ప్రయోజనం..!
Alert Employees: అందులో ఒకటి ఈపీఎఫ్ (EPF) పథకం 1952, రెండోది పెన్షన్ స్కీమ్ (EPS) 1995, మూడోది ఉద్యోగుల డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) 1976 ఉన్నాయి.
Alert Employees: ఉద్యోగులకి అలర్ట్.. ఈ పథకం కింద 7 లక్షల ప్రయోజనం..!
Alert Employees: ఉద్యోగం చేసే వ్యక్తులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో (EPFO) సభ్యులుగా ఉన్నట్లయితే వారికి రూ. 7 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. వాస్తవానికి ఈపీఎఫ్‌వో ద్వారా మూడు స్కీంలు నడుస్తున్నాయి. అందులో ఒకటి ఈపీఎఫ్ (EPF) పథకం 1952, రెండోది పెన్షన్ స్కీమ్ (EPS) 1995, మూడోది ఉద్యోగుల డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) 1976 ఉన్నాయి.
ఈపీఎఫ్‌వోలో సభ్యులైన ఉద్యోగులందరికీ ఈడీఎల్‌ఐ పథకం వర్తిస్తుంది. దీనికింద అకాల మరణం సంభవిస్తే ఉద్యోగుల నామినీకి రూ.7 లక్షల మరణ ప్రయోజనం లభిస్తుంది. కానీ ఉద్యోగులు ఈపీఎస్, ఈపీఎఫ్ పథకాల డబ్బులు చెల్లించి ఉండాలి. అయితే ఈడీఎల్ఐ పథకంలో మాత్రం ఉద్యోగి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండద. దీనికి సంస్థ యజమాని మాత్రమే బాధ్యత వహిస్తాడు.
1976లో పథకం ప్రారంభం
ఎవరైన ఉద్యోగి దురదృష్టవశాత్తూ మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బీమా రూపంలో రూ.7 లక్షలు అందిస్తారు. అయితే ఈపీఎఫ్‌వోలో సభ్యుడై ఉండాలి. వాస్తవానికి ఈడీఎల్‌ఐ స్కీంని 1976లో ప్రారంభించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ చట్టం 1952 కింద కవర్ చేసే అన్ని సంస్థలు డిఫాల్ట్‌గా ఈడీఎల్‌ఐ ప్రయోజనాలు పొందవచ్చు.
ఈడీఎల్‌ఐ సహకారం
ఈపీఎఫ్‌లో ఉద్యోగి, యజమాని సహకారం ఉంటుంది. అయితే ఈడీఎల్‌ఐ పథకం కింద యజమాని సహకారం బేసిక్+DAలో 0.5% మాత్రమే ఉంటుంది. ఇది గరిష్టంగా 75 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఒక సంవత్సరం నిరంతరం పని చేసినట్లయితే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఈపీఎఫ్‌లో క్రియాశీల సభ్యునిగా ఉండాలని గుర్తుంచుకోండి.
ఈడీఎల్‌ఐ లెక్కింపు
ఈడీఎల్‌ఐ గణన చాలా సులభం. గత 12 నెలల ఉపాధిలో ఉద్యోగి సగటు నెలవారీ ఆదాయానికి 35 రెట్లు లెక్కిస్తారు. ఉదాహరణకు మీ జీతం రూ.15,000 అయితే గరిష్ట పరిమితి 35 రెట్లు అంటే రూ.35 x 15,000 = రూ. 5.25 లక్షలు. స్కీమ్ కింద చెల్లించాల్సిన మొత్తాన్ని రూ. 7 లక్షలుగా చేయడానికి సంస్థ రూ.1.75 లక్షల బోనస్ మొత్తాన్ని కలుపుతుంది. ఇలా 7 లక్షల రూపాయలు అవుతుంది.
ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?
అకాల మరణం సంభవిస్తే నామినీ క్లెయిమ్‌కు సంబంధించి అన్ని పత్రాలతో పాటు పీఎఫ్, పెన్షన్ విత్ డ్రా చేయాల్సి ఉంటుంది. నామినీకి ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం లేదా వారసత్వ ధృవీకరణ పత్రం ఉండాలి. అదనంగా బ్యాంక్ ఖాతా, రద్దు చేసిన చెక్కు కాపీ అందించాలి.