Union Budget 2025: క్యాన్సర్ సహా 36 మందులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత..!

Union Budget 2025: క్యాన్సర్ సహా 36 ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మందులపై కస్టమ్ డ్యూటీని వంద శాతం తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.

Update: 2025-02-01 07:32 GMT

Union Budget 2025: క్యాన్సర్ సహా 36 ప్రాణాంతక వ్యాధులకు సంబంధించిన మందులపై కస్టమ్ డ్యూటీని వంద శాతం తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ కు బడ్జెట్ ను సమర్పించారు. ఇలాంటి రోగాలకు సంబంధించిన మందులపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేయడంతో ఈ మందుల ధరలు తగ్గనున్నాయి. 2024 బడ్జెట్ లో మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీని కేంద్రం ఎత్తివేసింది. క్యాన్సర్ కు సంబంధించిన ట్రీట్ మెంట్ కోసం ఉపయోగించే రోబోటిక్స్, రేడియోథరపీ మెషీన్స్ పై 37 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేస్తున్నారు.

ప్రతి ఏటా దేశంలో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదౌతున్నాయి. క్యాన్సర్ సోకినవారిలో 9.3 లక్షల మంది రోగులు 2019 నుంచి మరణించారని లాన్సెట్ స్టడీ చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం 2020లో క్యాన్సర్ రోగుల సంఖ్య 13.9 లక్షల నుంచి 14.2 లక్షలకు పెరిగింది. 2021 నుంచి 2022లో ఈ సంఖ్య 14. 6లక్షలకు పెరిగింది.

దేశంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 10 వేల అడిషనల్ మెడికల్ సీట్లను మెడికల్ కాలేజీల్లో పెంచనున్నట్టు తెలిపింది. వచ్చే ఏడాది మరో 10 వేల అదనపు మెడికల్ సీట్లను వచ్చే విద్యా సంవత్సరంలో పెంచుతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లను పెంచుతామని కేంద్రం వివరించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 200 డే కేర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చెప్పారు.

Tags:    

Similar News