The Paradise Movie: విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోన్న నాని-శ్రీకాంత్ ఓదెలా మూవీ
The Paradise Movie: వరుస విజయాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ పెంచుకుంటూ పోతున్న హీరో నాని, మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని చేస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను రేపుతోంది.

ఈ సినిమా మ్యూజిక్ హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ సరిగమ ఆశ్చర్యకరంగా రూ. 18 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఇది ఇప్పటివరకు నాని సినిమాలకు వచ్చిన అత్యధిక ఆడియో రైట్స్ డీల్ గా ఈ సినిమా రికార్డు సృష్టించింది.
దసరా వంటి భారీ హిట్ తర్వాత మళ్లీ నాని - శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ హైప్ ఏర్పడింది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలై చిన్న గ్లింప్స్ వీడియో యూట్యూబ్, సోషల్ మీడియా వేదికల్లో మిలియన్ల వ్యూస్ సంపాదించి, ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ గ్లింప్స్ చూసిన వారంతా, “ఇది మరో విభిన్నమైన కథతో కూడిన విజువల్ వండర్” అని అభిప్రాయపడుతున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈ స్థాయి మ్యూజిక్ రైట్స్ డీల్ రావడం, సినిమాపై ఉన్న అంచనాలను స్పష్టంగా చూపిస్తుంది. మరి ఈ సినిమాతో నాని కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.