Zelio Gracy+: సింగిల్ ఛార్జ్ పై 130కిమీ.. కేవలం రూ.20ఖర్చుతో ఈ స్కూటర్ మీద రోజంతా తిరిగేవచ్చు
Zelio Gracy+: జైలియో ఈ మొబిలిటీ సంస్థ తన గ్రాసీ ప్లస్ అనే లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Zelio Gracy+: సింగిల్ ఛార్జ్ పై 130కిమీ.. కేవలం రూ.20ఖర్చుతో ఈ స్కూటర్ మీద రోజంతా తిరిగేవచ్చు
Zelio Gracy+: జైలియో ఈ మొబిలిటీ సంస్థ తన గ్రాసీ ప్లస్ అనే లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే కేవలం 1.8 యూనిట్ల కరెంటు మాత్రమే తీసుకుంటుంది. అంటే, సుమారుగా రూ. 20 ఖర్చుతో ఫుల్ ఛార్జ్ అవుతుంది. భారత రోడ్లపై సులభంగా వెళ్ళేందుకు వీలుగా దీని గ్రౌండ్ క్లియరెన్స్ 180 మి.మీ.కు పెంచారు. ఈ స్కూటర్ బరువు 88 కిలోలు, 150 కిలోల బరువును మోయగలదు. అందుకే, ఇది డెలివరీ చేసే వారికి, ఆఫీసుకు వెళ్ళే వారికి, విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్.
కొత్త గ్రాసీ ప్లస్ ఇప్పుడు ఆరు రకాల బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో లిథియం-అయాన్, జెల్ బ్యాటరీ రకాలు ఉన్నాయి. దీని టాప్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 130 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు. ఇది ఎక్కువ దూరం ప్రయాణించే వారికి చాలా అనుకూలం. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. అందుకే, ఇది లో-స్పీడ్ కేటగిరీలో వస్తుంది. దీంతో చాలా రాష్ట్రాల్లో దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.
గ్రాసీ ప్లస్ లో డిజిటల్ డిస్‌ప్లే, కీలెస్ స్టార్ట్, డీఆర్‌ఎల్, యాంటీ-థెఫ్ట్ అలారం, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, పార్కింగ్ గేర్, వెనుక కూర్చునేవారికి ఫుట్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది వైట్, గ్రే, బ్లాక్, నీలం అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఈ అప్‌డేట్‌లు స్కూటర్ పనితీరును పెద్దగా మార్చకపోయినా, కంపెనీ వినియోగదారుల సూచనలు, అవసరాల ఆధారంగా దీన్ని మెరుగుపరిచిందని తెలుస్తోంది. కంపెనీ ఈ స్కూటర్‌పై మంచి వారంటీ కూడా ఇస్తోంది. స్కూటర్‌కు రెండేళ్లు, లిథియం-అయాన్ బ్యాటరీకి మూడేళ్లు, జెల్ బ్యాటరీకి ఒక సంవత్సరం వారంటీ ఉంది.
ఛార్జింగ్ సమయం బ్యాటరీ రకాన్ని బట్టి మారుతుంది. లిథియం-అయాన్ బ్యాటరీకి దాదాపు 4 గంటలు పడుతుంది.. అయితే జెల్ బ్యాటరీకి 8 నుండి 12 గంటల సమయం పడుతుంది. బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా మెరుగుపరిచారు. ముందు డ్రమ్ బ్రేక్, వెనుక డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ సౌకర్యం కోసం హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు అమర్చారు. దీని ధర రూ. 58,000 నుండి ప్రారంభమవుతుంది.