Petrol or Diesel: పెట్రోల్ కారులో డీజిల్ కొట్టిస్తే ఏమవుతుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారంతే..!
Petrol or Diesel: భారతదేశంలో CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. కానీ, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కార్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో పెట్రోల్ కార్లే ఎక్కువుగా కనిపిస్తుంటాయి.
Petrol or Diesel: పెట్రోల్ కారులో డీజిల్ కొట్టిస్తే ఏమవుతుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారంతే..!
Petrol or Diesel: భారతదేశంలో CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. కానీ, ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కార్లు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో పెట్రోల్ కార్లే ఎక్కువుగా కనిపిస్తుంటాయి. కాబట్టి మీ పెట్రోల్ కారులో ప్రమాదవశాత్తూ డీజిల్ నింపితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
పెట్రోల్ కారులో డీజిల్ నింపడం వల్ల ఇంజిన్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇంజిన్ సీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. డీజిల్ సాంద్రత పెట్రోల్ కంటే ఎక్కువ. ఇది పెట్రోల్ కంటే తక్కువ మండుతుంది. ఇది పెట్రోల్ ఇంజన్ సిలిండర్, పిస్టన్, షాఫ్ట్ దెబ్బతినేలా చేస్తుంది.
ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది..
మీరు పొరపాటున పెట్రోల్ కారులో డీజిల్ పోసినట్లయితే, మీరు దాని గురించి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు పెట్రోల్ కారును డీజిల్‌తో నడిపితే నష్టం జరగవచ్చు. కాబట్టి, ఇంధనం మారితే కారుని స్టార్ట్ చేయకుండా ఉండటం మంచిది.
నిపుణుల సహాయం పొందండి..
ఇలా జరిగిన వెంటనే నిపుణుడిని సంప్రదించి డీజిల్‌ను తీసివేయాలి. అలాగే సర్వీస్ సెంటర్ ద్వారా కారుని చెక్ చేయించుకోవాలి. పెట్రోలు ఇంజన్ డీజిల్‌తో ఎక్కువసేపు నడిస్తే లేదా మళ్లీ మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తే డీజిల్ ఇంజిన్‌లో లోపం ఏర్పడుతుంది. ఇంజిన్ సీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
జాగ్రత్తలు అవసరం..
డీజిల్ కారు ఇంజన్‌లోకి ప్రవేశించిన తర్వాత, దానిని బయటకు తీయడం కష్టం. అయితే, డీజిల్ ఇంధన ట్యాంక్ వరకు మాత్రమే ఉంటే, దానిని తీసివేయడం సులభం. అంటే, పొరపాటున ట్యాంక్‌లో తప్పుడు ఇంధనం నింపితే మంచిది. అప్పుడు మీరు పెట్రోల్ పంపులోనే దాని గురించి తెలుసుకోవాలి.
మీరు వేరొకరి వాహనాన్ని తీసుకుంటే, అందులో ఏ ఇంధనం ఉపయోగించాలో మీకు తెలియకపోతే, దాని గురించి పెట్రోల్ పంప్ ఉద్యోగిని అడగండి. ఎందుకంటే కారులో పెట్రోల్ లేదా డీజిల్ వేయాలా అని ఇంధన మూతపై రాసి ఉంటుంది.