Upcoming MPVs: పెద్ద కార్లు బోలెడన్నీ ప్రయోజనాలు.. త్వరలో విడుదల కానున్న ఎంపీవీలు ఇవే..!
Upcoming MPVs: ఇండియన్ ఆటో మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ భారీగానే ఉంది. ఇవి దూర ప్రయాణాలకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
Upcoming MPVs: పెద్ద కార్లు బోలెడన్నీ ప్రయోజనాలు.. త్వరలో విడుదల కానున్న ఎంపీవీలు ఇవే..!
Upcoming MPVs: ఇండియన్ ఆటో మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ భారీగానే ఉంది. ఇవి దూర ప్రయాణాలకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అందుకే సెడాన్ కార్ల అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీవీ కార్లు వీటికి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఎందుకంటే ఎస్‌యూవీలో ఉండే సౌకర్యాలతో పాటు అదనంగా సీటింగ్ ఉంటుంది. 7-8 సీట్స్ ఉండటంతో పాటు లాంగ్ డ్రైవ్‌కు కూడా కంఫర్ట్ బాగుంటుంది. అయితే రానున్న రోజుల్లో మీరు 7-సీటర్ కార్ కొనాలని చూస్తుంటే.. విడుదలకు సిద్ధంగా ఉన్న ఎంపీవీల గురించి తెలుసుకుందాం.
1. కియా కేరెన్స్
కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ కియా త్వరలో తన పాపులర్ ఎంపీవీ కేరెన్స్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దేశీయ మార్కెట్లో మారుతి ఎర్టిగాతో పోటీ పడుతున్న ఈ ఎంపీవీ ఇటీవలే టెస్టింగ్ సమయంలో కనిపించింది. అప్‌డేటెడ్ కేరెన్స్‌లో హెడ్‌లైట్‌లు, రీడిజైన్ చేసిన బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, టైల్‌లైట్‌లతో సహా అనేక ముఖ్యమైన డిజైన్ మార్పులను చూడచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లేతో పాటు అనేక కొత్త అధునాతన ఫీచర్‌లను జోడించే అవకాశం ఉంది. అయితే ఈ ఎంపీవీ ఇంజన్, ట్రాన్స్‌మిషన్‌లో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం లేదు.
2. ఎంజీ ఎమ్9
ఎంజీ మోటార్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు త్వరలో MG M9 ఎలక్ట్రిక్ లగ్జరీ ఎంపీవీని విడుదల చేయనుంది. ఈ కారు 2+2+3 సీటింగ్ లేఅవుట్‌తో ప్రీమియం, సౌకర్యవంతమైన కారుగా మారుతుంది. ఫీచర్స్‌లో ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్లు, పవర్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్, మసాజ్, మెమరీ, వెంటిలేషన్, హీటింగ్ ఫంక్షన్‌లతో కూడిన సీట్లు ఉన్నాయి. అంతే కాకుండా డ్రైవర్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అందించారు.
3.రెనాల్ట్ ట్రైబర్
2019లో విడుదలైన రెనాల్ట్ ట్రైబర్ త్వరలో ఎంపీవీ అవతార్‌లో రానుంది. ఈ రెనాల్ట్ ఎంపీవీలో కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, కొత్త స్టైల్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ రాబోయే ఎంపీవీలు భారతీయ మార్కెట్లో 7-సీటర్ సెగ్మెంట్‌ను మరింత ఉత్తేజపరిచేలా చేస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.