Upcoming Hyundai Cars: 2025లో హ్యుందాయ్ క్రేజీ లైనప్.. సందడి చేయడానికి సిద్ధంగా 5 కొత్త కార్లు..!
Upcoming Hyundai Cars 2025: హ్యుందాయ్ ఇండియా దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. హ్యుందాయ్ తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే అనేక కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.
Upcoming Hyundai Cars: 2025లో హ్యుందాయ్ క్రేజీ లైనప్.. సందడి చేయడానికి సిద్ధంగా 5 కొత్త కార్లు..!
Upcoming Hyundai Cars 2025: హ్యుందాయ్ ఇండియా దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. హ్యుందాయ్ తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే అనేక కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందులో న్యూ జెన్ హ్యుందాయ్ వెన్యూ నుండి రూ. 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న హ్యుందాయ్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్ వరకు పేర్లు ఉన్నాయి. రాబోయే ఈ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
2025 Hyundai Venue
హ్యుందాయ్ వెన్యూ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ఈ సరసమైన ఎస్‌యూవీ త్వరలో కొత్త అవతార్‌లోకి రానుంది. గూఢచారి షాట్‌లు కొత్త వెన్యూలో అప్‌డేట్ చేసిన హెడ్‌లైట్లు, ఫ్రంట్ గ్రిల్‌తో పాటు సరికొత్త టెయిల్-ల్యాంప్‌లు లభిస్తాయని వెల్లడైంది. ఈ ఏడాది చివరికల్లా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ కొత్త వెన్యూలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,పనోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు భద్రత కోసం ప్రామాణిక 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 1.2-లీటర్ నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఒక లీటర్ పెట్రోల్‌లో 15 కిమీ, డీజిల్‌లో 21 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది.
Hyundai Creta Hybrid
హైబ్రిడ్ కార్లకు నానాటికీ పెరుగుతున్న డిమాండ్ కారణంగా క్రెటా హైబ్రిడ్ వేరియంట్‌ను త్వరలో చూడచ్చు. ప్రస్తుతం గరిష్టంగా 21.8 KMPL మైలేజీని ఇస్తున్న క్రెటా, హైబ్రిడ్ టెక్నాలజీతో ఒక లీటరు పెట్రోల్‌పై 26 నుండి 28 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 360 డిగ్రీల కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి.
Hyundai Bayon Compact SUV
హ్యుందాయ్ భారత్ కోసం ఒక సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని త్వరలో తీసుకురానుంది. ఈ కారుడిజైన్ గ్లోబల్ మార్కెట్‌లో విక్రయిస్తున్న బయోన్ మాదిరిగా ఉంటుంది. బయోన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో వెన్యూ, క్రెటా మధ్యస్థంగా ఉంటుంది.
Hyundai Ioniq 9
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రవేశించిన హ్యుందాయ్ ఐయోనిక్ 9 త్వరలో భారతీయ రోడ్లపై పరుగులు తీయడానికి వస్తుంది. సంస్థ ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఈ సంవత్సరం చివరి నాటికి విడుదల కానుంది.
Hyundai Tucson Facelift
హ్యుందాయ్ టక్సన్ కొత్త అవతార్‌లో వస్తుందని భావిస్తున్నారు. టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన స్కిడ్ ప్లేట్లు, ఎలిజెంట్ లైటింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త లుక్ కోసం కోసం కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ ఉంటాయని అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇందులో ఎటువంటి మెకానికల్ అప్‌డేట్‌లు ఉండవు.