Toyota Urban Cruiser EV: ఈవీ రేసులోకి కొత్త ప్లేయర్.. రయ్ రయ్ మంటూ దూసుకొస్తుంది.. పవర్, పర్ఫామెన్స్ అదుర్స్..!

Toyota Urban Cruiser EV: టయోటా అర్బన్ క్రూయిజర్ భారత మార్కెట్లో అత్యంత సరసమైన, ప్రసిద్ధ హైబ్రిడ్ కార్లలో ఒకటి. ఇది అద్భుతమైన ఇంధన సామర్థ్యం, భలమైన భద్రతా ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది.

Update: 2025-05-27 01:30 GMT

Toyota Urban Cruiser EV: ఈవీ రేసులోకి కొత్త ప్లేయర్.. రయ్ రయ్ మంటూ దూసుకొస్తుంది.. పవర్, పర్ఫామెన్స్ అదుర్స్..!

Toyota Urban Cruiser EV: టయోటా అర్బన్ క్రూయిజర్ భారత మార్కెట్లో అత్యంత సరసమైన, ప్రసిద్ధ హైబ్రిడ్ కార్లలో ఒకటి. ఇది అద్భుతమైన ఇంధన సామర్థ్యం, భలమైన భద్రతా ఫీచర్లకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ ఎస్‌యూవీ త్వరలో ఎలక్ట్రిక్ అవతార్‌లో కూడా లాంచ్ అవుతుంది. నివేదికల ప్రకారం.. కంపెనీ అర్బన్ క్రూయిజర్ ఈవీ లాంచ్ కోసం సన్నాహాలు ప్రారంభించింది, ఇది మారుతి సుజుకి e VITARA ఆధారంగా ఉంటుంది. 2026 నాటికి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

Urban Cruiser EV Price

టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ లాంచ్ తేదీ,ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీని ధర రూ.15 లక్షల నుండి రూ. 22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. ఈ రేంజ్‌లో ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో వంటి కార్లతో పోటీపడుతుంది.

Urban Cruiser EV Specifications

అర్బన్ క్రూయిజర్ ఈవీలో అనేక ఆధుని, ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటాయి. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో వస్తుంది. దీనితో పాటు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉండవచ్చు, ఇది లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. దీనితో పాటు, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. మొదటి 49 కిలోవాట్, బ్యాటరీ ప్యాక్ సుమారు 400 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, రెండవ 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 500 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది. దీనితో పాటు, ఈ మోడల్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎంపికలో కూడా అందుబాటులో ఉంటుంది, ఇది మెరుగైన ట్రాక్షన్, డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో బ్యాటరీని 30-40 నిమిషాల్లో 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది, అయితే 7.4 kW AC ఛార్జర్ తో, పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 9-10 గంటలు పడుతుంది.

Tags:    

Similar News