Toyota Innova Hycross Exclusive Edition launched: ఈ కారుకు దిష్టి తీయాల్సిందే.. ఇన్నోవా హైక్రాస్ కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌.. మూడు నెలలే ఛాన్స్..!

టయోటా మోటార్స్ దాని ఫేమస్ ఎస్‌యూవీ ఇన్నోవా హైక్రాస్ కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

Update: 2025-05-03 13:06 GMT

Toyota Innova Hycross Exclusive Edition Launched: టయోటా మోటార్స్ దాని ఫేమస్ ఎస్‌యూవీ ఇన్నోవా హైక్రాస్ కొత్త ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్‌కు డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ ట్రీట్‌మెంట్ అందించారు. కంపెనీ దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.32.58 లక్షలుగా నిర్ణయించింది. ఇది ZX (O) ట్రిమ్ కంటే రూ. 1.24 లక్షలు ఎక్కువ. డ్యూయల్-టోన్ ఇంటీరియర్ ఫినిషింగ్, కొన్ని కొత్త ఫీచర్లు దీనికి జోడించారు. ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ పరిమిత సంఖ్యలో మే నుండి జూలై 2025 వరకు అమ్మకానికి రానుంది. అంటే మీరు ఈ కారును 3 నెలలు మాత్రమే కొనగలరు.

ఇన్నోవా హైక్రాస్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ కొత్త డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ ఫినిషింగ్‌తో బ్లాక్ రూఫ్‌తో వస్తుంది. సూపర్ వైట్ లేదా పెర్ల్ వైట్ అనే రెండు షేడ్స్‌లో లభిస్తుంది. గ్రిల్, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్, రియర్ బంపర్ గార్నిష్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, వింగ్ మిర్రర్లకు కొత్త గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. టయోటా 'ఇన్నోవా' అక్షరాలతో కూడిన బానెట్ సింబల్, వెనుక భాగంలో ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ బ్యాడ్జ్‌ను కూడా జోడించింది.

ఇన్నోవా హైక్రాస్ ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుంటే, డ్యాష్‌బోర్డ్, డోర్ ప్యాడ్‌లు , సీట్ అప్హోల్స్టరీ కోసం డ్యూయల్-టోన్ ఫినిషింగ్ ఉంది. డివైజెస్‌లో టయోటా ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, ఫుట్‌వెల్ లాంప్‌ ఉన్నాయి. పవర్డ్ ఒట్టోమన్‌తో కూడిన రెండవ వరుస కెప్టెన్ సీట్లు, ముందు వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, అడాస్ సూట్ వంటి ఫీచర్లు కూడా ZX(O) నుండి అలాగే ఉంచారు.

ఇన్నోవా హైక్రాస్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్, స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే వచ్చే టాప్-స్పెక్ ZX(O) ట్రిమ్‌పై ఆధారపడింది. హైక్రాస్‌లో 2.0-లీటర్, నాలుగు-సిలిండర్ల స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ ఉంటుంది, ఇది మొత్తం 186హెచ్‌పి పవర్, 206ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది e-CVT కి జతచేసి ఉంటుంది. టయోటా ఈ హైబ్రిడ్ కారు లీటరుకు 23.24 కిలోమీటర్ల మైలేజ్‌ని అందిస్తుందని పేర్కొంది.

Tags:    

Similar News