Toyota Innova EV: ఎలక్ట్రిక్ అవతార్‌లో టయోటా ఇన్నోవా.. లాంచ్ ఎప్పుడంటే..?

Toyota Innova EV
x

Toyota Innova EV: ఎలక్ట్రిక్ అవతార్‌లో టయోటా ఇన్నోవా.. లాంచ్ ఎప్పుడంటే..?

Highlights

Toyota Innova EV: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా అనేక దేశాల్లో ఇన్నోవా ద్వారా తన కార్లను విక్రయిస్తుంది.

Toyota Innova EV: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టయోటా అనేక దేశాల్లో ఇన్నోవా ద్వారా తన కార్లను విక్రయిస్తుంది. ఫిబ్రవరి 2025లో జరిగిన ఇండోనేషియా మోటార్ షో సందర్భంగా కంపెనీ తన 7 సీట్ల ఎంపీవీ ఈవీ వెర్షన్‌ను ప్రదర్శించింది. ICE వెర్షన్‌తో పోలిస్తే ఇందులో ఎలాంటి మార్పులు చేశారు. టయోటా ఇన్నోవా క్రిస్టా ఈవీని ఇండియాలోకి తీసుకురావచ్చా లేదా? తదితర వివరాలు తెలుసుకుందాం.

ఇన్నోవా క్రిస్టా టయోటా ద్వారా 7 సీట్ల ఎంపీవీగా దేశంలో అందుబాటులో ఉంది. ఈ వాహనాన్ని ప్రస్తుతం డీజిల్ ఇంజన్‌తో కంపెనీ తీసుకొచ్చింది. అయితే త్వరలో ఈ వాహనాన్ని ఈవీ వెర్షన్‌లో కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండోనేషియాలో జరుగుతున్న మోటార్ షో సందర్భంగా కంపెనీ తన కాన్సెప్ట్ వెర్షన్‌ను పరిచయం చేసింది.

ఇన్నోవా క్రిస్టా BEV కాన్సెప్ట్ వెర్షన్ ఇండోనేషియా మోటార్ షోలో ప్రదర్శించింది. ఈ వెహికల్ డిజైన్ దేశంలో అందిస్తున్న ఇన్నోవా క్రిస్టా డీజిల్‌ వేరియంట్ మాదిరిగానే ఉంది. కానీ ఈవీ ఫ్రంట్ గ్రిల్ మూసివేశారు. గ్రాఫిక్స్‌తో రూపాన్ని మార్చేశారు. వాహనంలో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో పాటు, లైట్లలో స్వల్ప మార్పులు చేశారు. ఎంపీవీకి బ్లాక్ క్లాడింగ్‌తో పాటు బ్లాక్ రూఫ్ పిల్లర్స్ అందించారు.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఇన్నోవా క్రిస్టా ఈవీలో 59.3కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఇందులో అమర్చిన మోటారు 134 కిలోవాట్ల పవర్, 700 న్యూటన్ మీటర్ల టార్క్‌ రిలీజ్ చేస్తుంది. ఈ కారుకు 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కారు రేంజ్, ఛార్జింగ్ గురించి పూర్తి సమాచారం వెల్లడికాలేదు.

టయోటా ఇన్నోవా క్రిస్టా BEV ఇండోనేషియా మోటార్ షోలో కాన్సెప్ట్ వెర్షన్‌గా ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వెహికల్ కాన్సెప్ట్ నుండి ప్రొడక్షన్ రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా క్రిస్టా BEVని ఇండియానికి తీసుకువస్తారా లేదా అనే దానిపై కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ దేశంలో ఈవీల అమ్మకాలు పెరుగుతున్నందున భవిష్యత్తులో దీనిని టయోటా ప్రవేశపెట్టవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories