Top 5 Most Affordable Electric Cars: ఇండియాలో లో బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్‌లోనూ రారాజులు
ఇండియాలో లో బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు.. రేంజ్‌లోనూ రారాజులు
Top 5 Low budget electric cars: భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ క్రేజ్ వేగంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆటో మొబైల్ కంపెనీలు అనేక కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో వస్తున్న ఇలాంటి ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
టాటా టియాగో EV
టాటా టియాగో ఈవీ అనేది టాటా మోటార్స్ EV పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ లెవల్ ఈవీ. ఇది నాలుగు వేరియంట్లలో, రెండు బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. దీని 19.2kWh బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై 250 కిమీ రేంజ్ అందిస్తుంది. లాంగ్ రేంజ్ 24kWh బ్యాటరీతో 315 కిమీ వరకు ప్రయాణించవచ్చు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రీ-స్టాండింగ్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.
ఎంజీ కామెట్ EV
MG కామెట్ EV ప్రస్తుతం భారత్‌లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 17.3kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 230 కిమీల రేంజ్ ఇస్తుందని ఎంజీ కంపెనీ చెబుతోంది.
ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షలుగా ఉంది. B-a-a-S మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.99 లక్షలుగా ఉంది.
టాటా పంచ్ EV
టాటా పంచ్ EV 3 వేరియంట్స్, రెండు బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంది. 25kWh బ్యాటరీ ప్యాక్‌తో 315km క్లెయిమ్ రేంజ్ వస్తుంది. లాంగ్ రేంజ్ వెర్షన్ 35kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. లాంగ్ రేంజ్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 415కిమీలు రేంజ్ ఇస్తుంది.
టాటా పంచ్ ఈవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ , ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇదే కాకుండా లేటెస్ట్ కార్లలో యువతరం కోరుకుంటున్న సన్ రూఫ్ ఫీచర్ కూడా ఉంది.
టాటా టిగోర్ EV
టాటా టిగోర్ EV 4 వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఏ వేరియంట్ అయినా బ్యాటరీ ప్యాక్ ఒకటే. టిగోర్ ఈవీ 26kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 315 కిమీల రేంజ్ అందిస్తుంది.
టాటా టిగోర్ ఈవీ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే... ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ మోడ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా నెక్సాన్ EV కారు
టాటా నెక్సాన్ ఈవీ కారు భారత్‌లో అత్యంత సరసమైన సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఈవీ ఎస్‌యూవీ. ఇది 3 వేరియంట్లు, మూడు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఇది 30kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీని క్లెయిమ్ రేంజ్ 325కిమీ. దీని 40.5kWh బ్యాటరీ ప్యాక్ 465km రేంజ్ ఇస్తుంది.
ఇటీవల టాటా నెక్సాన్ ఈవీలో కూడా 45kWh బ్యాటరీని ప్యాక్‌ను చేర్చారు. ఇది సింగిల్ ఛార్జింగ్‌పై 489 కిమీల రేంజ్ అందిస్తుంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.49 లక్షలుగా ఉంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.