High speed Electric Bikes: భారత్‌లో అత్యంత వేగంగా పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే..!

High speed Electric Bikes: గత కొంత కాలంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను చాలా ఇష్టపడుతున్నారు.

Update: 2025-02-26 13:00 GMT

High speed Electric Bikes: భారత్‌లో అత్యంత వేగంగా పరుగులు పెట్టే ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే..!

High speed Electric Bikes: గత కొంత కాలంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను చాలా ఇష్టపడుతున్నారు. కొత్త మోడళ్ల రాకతో వినియోగదారులకు మార్కెట్లో చాలా మంచి ఎంపికలు ఉన్నాయి. విశేషమేమిటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌ల ధర పెట్రోల్ బైక్‌లతో సమానంగా వచ్చింది. ఎలక్ట్రిక్ బైక్ రోజువారీ ఉపయోగం కోసం చాలా మంచిది. మీరు కూడా ఇలాంటి బైక్ కోసం వెతుకుతున్నట్లయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి.

ఒబెన్ రోర్

ఒబెన్ రోర్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ ధర 1.50 లక్షలు. ఇది మేడ్ ఇన్ ఇండియా బైక్. ఇందులో 8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 187 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ బైక్ ఇండియాకి వచ్చి చాలా రోజులైంది.

రివోల్ట్ ఆర్‌వి 400

రివోల్ట్ ఈ బైక్ భారతదేశంలో తన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బైక్ ధర రూ.1.50 లక్షలు. రివోల్ట్ ఆర్‌వి 400 ఎలక్ట్రిక్ బైక్ పూర్తి ఛార్జ్‌పై 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. సిటీలోనూ, హైవేపైనా హాయిగా నడపగలిగే విధంగా ఈ బైక్‌ను డిజైన్ చేశారు. త్వరలో కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకురానుంది.

మేటర్ ఎరా 5000+

దేశంలో గేర్‌లతో వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇదే. ఈ బైక్‌ అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ బైక్ 125 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. బైక్ గరిష్ట వేగం 98 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ బైక్ డిజైన్ స్పోర్టీగా ఉంది. యూత్‌కి బాగా నచ్చుతుంది. బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.74 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Tags:    

Similar News