Tata Altroz Facelift: టాటా ఆల్ట్రోజ్ కొత్త వేరియంట్.. ఫీచర్స్ చూస్తే కళ్లు చెదిరిపోతాయ్..!

Tata Altroz Facelift: టాటా మోటార్స్ ప్రతి సంవత్సరం ఒక కొత్త కారును ప్రత్యేకంగా అమ్మకానికి తెస్తుంది.

Update: 2025-03-07 11:03 GMT

Tata Altroz Facelift: టాటా ఆల్ట్రోజ్ కొత్త వేరియంట్.. ఫీచర్స్ చూస్తే కళ్లు చెదిరిపోతాయ్..!

Tata Altroz Facelift: టాటా మోటార్స్ ప్రతి సంవత్సరం ఒక కొత్త కారును ప్రత్యేకంగా అమ్మకానికి తెస్తుంది. ప్రస్తుతం, కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'ఆల్ట్రోజ్'ని అప్‌డేట్ చేసిన రూపంలో అంటే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త ఆల్ట్రోజ్ కారు టెస్ట్ డ్రైవ్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

కొత్త టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కొన్ని మార్పులు చూడచ్చు. ఇందులో కొత్త ఫ్రంట్ ఫాసియా, బంపర్‌ ఉంటుంది. అలానే వినూత్నమైన హెడ్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, డజన్ల కొద్దీ ఫీచర్లతో త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Tata Altroz Specifications

ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.65 లక్షల నుండి రూ. 11.30 లక్షల మధ్య ఉంది. XE, XM, XM S, XM Plus, XM Plus S అనే వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు.

కొత్త టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్‌లో నాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, సిఎన్‌జి ఇంజన్లు ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేేర్ బాక్స్‌లు ఉన్నాయి. 19.33 నుండి 26.20 kmpl మైలేజీని ఇస్తుంది.

ఈ కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌తో వస్తుంది. భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరాను చూడచ్చు.

ఈ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.50 లక్షల నుండి రూ. 11 లక్షల మధ్య ఉంటుంది. 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 120 పిఎస్ హార్స్ పవర్, 170 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇదందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ కూడా ఉంది.

కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10.25-అంగుళాల), ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే (7-అంగుళాల), 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్, ఆటో ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌తో సహా వివిధ ఫీచర్లతో వస్తుంది. ప్రయాణీకుల రక్షణ కోసం 6-ఎయిర్‌బ్యాగ్స్, రేర్ పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరాలు ఉన్నాయి.

Tags:    

Similar News