Harrier EV: ఈ నెలలోనే రోడ్ల మీదకు రాబోతున్న టాటా లేటెస్ట్ సెన్సేషన్.. డెలివరీలకు రంగం సిద్ధం
Harrier EV: భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ పెద్ద ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన హారియర్ ఈవీ ఉత్పత్తిని ప్రారంభించింది.
Harrier EV: ఈ నెలలోనే రోడ్ల మీదకు రాబోతున్న టాటా లేటెస్ట్ సెన్సేషన్.. డెలివరీలకు రంగం సిద్ధం
Harrier EV: భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ పెద్ద ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన హారియర్ ఈవీ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కారు బుకింగ్స్ మొదలుపెట్టిన వెంటనే ఉత్పత్తి మొదలుపెట్టడం విశేషం. మహారాష్ట్రలోని పుణె ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్ కారు తయారవుతోంది. ఇది కంపెనీకి కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, దీని ధర రూ.21.49 లక్షల నుండి రూ.30.23 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
హారియర్ ఈవీకి మార్కెట్ నుండి అద్భుతమైన స్పందన లభించింది. బుకింగ్‌లు కూడా బాగా జరుగుతున్నాయి. ఈ కారు త్వరలోనే డీలర్‌షిప్‌లకు చేరుకుంటుంది. ఈ నెల నుంచే డెలివరీలు మొదలవుతాయి. ఈ ఎలక్ట్రిక్ కారు మొత్తం 4 ప్రత్యేకమైన రంగులలో అందుబాటులో ఉంది. నైనితాల్ నాక్టర్న్, ఎంపావర్డ్ ఆక్సైడ్, ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే . వీటితో పాటు లాంచ్ అయినప్పటి నుంచే ఆల్-బ్లాక్ స్టీల్త్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది.
కొత్త హారియర్ ఈవీ టాటా acti.ev+ ఆర్కిటెక్చర్ పై తయారు చేయబడింది. ఇది గతంలో ఉన్న పెట్రోల్-డీజిల్ హారియర్ ప్లాట్‌ఫామ్‌కు అప్‌డేటెడ్ వెర్షన్. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రియర్-వీల్ డ్రైవ్..ఈ వెర్షన్‌లో వెనుక వైపున ఒక మోటార్ ఉంటుంది.క్వాడ్-వీల్ డ్రైవ్ వెర్షన్‌లో ముందు, వెనుక రెండు వైపులా ఒక్కో మోటార్ ఉంటుంది. దీనివల్ల ఇది ఫోర్ వీల్ డ్రైవ్‌గా పనిచేస్తుంది.
హారియర్ ఈవీలోని RWD వెర్షన్ మోటార్ 235 బీహెచ్‌పీ పవర్, 315 ఎన్‌ఎమ్ టార్క్ ను అందిస్తుంది. ఇక QWD డ్యూయల్-మోటార్ వెర్షన్‌లో 391 బీహెచ్‌పీ పవర్, 504 ఎన్‌ఎమ్ టార్క్ లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 65 kWh బ్యాటరీ ప్యాక్ 538 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.75 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న వెర్షన్‌లో RWD కు 627 కిలోమీటర్లు, QWD కు 622 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. హారియర్ ఈవీలో అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.ఫుల్ డిజిటల్ కన్సోల్ , హార్మన్ శామ్‌సంగ్ నియో క్యూఎల్ఈడీ డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది.540-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, డిజిటల్ ఐఆర్‌వీఎమ్, ట్రాన్స్‌పరెంట్ వెహికల్ ఫీచర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.