New Skoda Kodiaq: స్టన్నింగ్ డిజైన్‌తో కొత్త స్కోడా కొడియాక్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

New Skoda Kodiaq: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా కొడియాక్ ఎస్‌యూవీని 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

Update: 2025-01-24 09:27 GMT

New Skoda Kodiaq: స్టన్నింగ్ డిజైన్‌తో కొత్త స్కోడా కొడియాక్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..? 

New Skoda Kodiaq: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా కొడియాక్ ఎస్‌యూవీని 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఈ కొత్త స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫారమ్ MQB EVO ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు. ఎస్‌‌యూవీ ముందు మోడల్‌తో పోలిస్తే Skoda Kodiaq మెరుగైన టెక్నాలజీ, కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వస్తోంది.

2025 స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, ఎమ్‌జీ గ్లోస్టర్, హ్యుందాయ్ టక్సన్, వోక్స్‌వ్యాగన్ టిగువాన్, జీప్ మెరిడియన్ ఎస్‌యూవీల వంటి వాటితో పోటీపడుతుంది. స్కోడా కోడియాక్ ప్రీమియం 7-సీటర్ ఎస్‌యూవీ కార్ ప్రేమికులకు ఉత్తమ ఎంపికలలో ఒకటి. ఈ కొత్త స్కోడా కొడియాక్ కొత్త తరం మోడల్ మునుపటి మోడల్ కంటే పెద్దది.

ఈ కోడియాక్ ఎస్‌యూవీ స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్ సెటప్‌తో రిఫ్రెష్ చేసిన ఫ్రంట్ ఫాసియా, నిలువు స్లాట్‌లతో కూడిన పెద్ద గ్రిల్‌ను కలిగి ఉంది. కొత్త స్కోడా కొడియాక్ ఎస్‌యూవీ అల్లాయ్ వీల్స్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటాయి. వెనుక ప్రొఫైల్‌లో రీడిజైన్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్-ల్యాంప్ క్లస్టర్, బంపర్ ఉన్నాయి.

ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడిన భారీ 13-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉన్నాయి. కొత్త స్కోడా కొడియాక్ ఎస్‌యూవీలో మరిన్ని భద్రతా ఫీచర్లను చూడచ్చు.

ఇది లెవెల్ 2 అడాస్ టెక్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉంది. టాప్-స్పెక్ ట్రిమ్ ఫుల్ అడాస్ ఫీచర్‌లతో లోడ్ అవుతుందని భావిస్తున్నారు. ఎస్‌యూవీ ఇప్పుడు వేరియంట్ లైనప్‌లో 6-ఎయిర్‌బ్యాగ్‌లతో స్టాండర్డ్‌గా వస్తుంది.

కొత్త తరం స్కోడా కొడియాక్‌లో ఎస్‌యూవీ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ 187 బిహెచ్‌పి పవర్, 320 టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా అందించారు.

Tags:    

Similar News