Skoda Kushaq Facelift Launched: కొత్త అవతారంలో స్కోడా కుషాక్.. ప్రీ-బుకింగ్స్ ప్రారంభం

Skoda Kushaq Facelift Launched: స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ భారత్‌లో ఆవిష్కరణ. కొత్త డిజైన్, రియర్ సీట్ మసాజర్, 5-స్టార్ సేఫ్టీతో మార్చిలో లాంచ్ కానుంది. ప్రీ-బుకింగ్స్ ప్రారంభం.

Update: 2026-01-20 09:58 GMT

Skoda Kushaq Facelift Launched: కొత్త అవతారంలో స్కోడా కుషాక్.. ప్రీ-బుకింగ్స్ ప్రారంభం

Skoda Kushaq Facelift Launched: స్కోడా ఆటో ఇండియా తన పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ‘కుషాక్’కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఆధునిక డిజైన్, ప్రీమియం లుక్‌తో పాటు సెగ్మెంట్‌లో తొలిసారిగా రియర్ సీట్ మసాజర్ వంటి ఫీచర్లను ఇందులో అందించింది. మార్చి నెలలో ఈ వాహనం అధికారికంగా రోడ్డెక్కనుండగా, ఇప్పటికే ప్రీ-బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది.

కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్‌లో అన్ని వేరియంట్లకు ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. హైఎండ్ వేరియంట్లలో వెలిగే ఫ్రంట్ గ్రిల్, వెనుక వైపు ఇల్యూమినేటెడ్ ‘Skoda’ లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అన్ని మోడల్స్‌లో అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉండగా, ‘మాంటే కార్లో’ అనే కొత్త టాప్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టారు.

ఇంటీరియర్‌లో 10.25 అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, 25.6 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ముందు సీట్లకు ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్, వెంటిలేషన్ సదుపాయాలు ఉండగా, వెనుక సీట్లకు మసాజర్ ఫీచర్‌ను అందించడం విశేషం. సన్‌రూఫ్ స్టాండర్డ్‌గా, టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ లభించనుంది.

భద్రత విషయానికొస్తే, ఈ కారుకు గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి 5-స్టార్ రేటింగ్ ఉంది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగులు, ఆధునిక సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంజిన్ పరంగా 1.0 లీటర్, 1.5 లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఆప్షన్లు కొనసాగుతుండగా, కొత్త గేర్‌బాక్స్ ఆప్షన్లతో మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందించనుంది.


Tags:    

Similar News