Revolt RV BlazeX: రివోల్ట్ మోటార్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఫుల్ ఛార్జింగ్‌పై 150కిమీ రేంజ్..!

Revolt BlazeX: రివోల్ట్ మోటార్స్ కొత్త RV BlazeX ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. బ్లేజ్‌ఎక్స్ స్మార్ట్, అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం. బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.114,990.

Update: 2025-02-26 15:00 GMT

Revolt RV BlazeX: రివోల్ట్ మోటార్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఫుల్ ఛార్జింగ్‌పై 150కిమీ రేంజ్..!                                                                                                                                            

Revolt BlazeX: రివోల్ట్ మోటార్స్ కొత్త RV BlazeX ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. బ్లేజ్‌ఎక్స్ స్మార్ట్, అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం. బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.114,990. ఈ మోటార్‌సైకిల్‌పై కంపెనీ 3 సంవత్సరాలు లేదా 45,000కిమీల వారంటీని కూడా ఇస్తోంది.ఈ బైక్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌లో నేటి నుండి బుక్ చేసుకోవచ్చు. డెలివరీ మార్చి 2025 మొదటి వారంలో ప్రారంభమవుతుంది.

బైక్‌ను విడుదల చేయడంపై రతన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చైర్‌పర్సన్ అంజలి రతన్ మాట్లాడుతూ.. 'రివోల్ట్ మోటార్స్‌లో ఆర్‌వి బ్లేజ్‌ఎక్స్ సరసమైన, అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్‌తో పట్టణ, గ్రామీణ ప్రయాణికులకు సాధికారత కల్పిస్తుంది'.

ఆర్‌వి బ్లేజ్‌ఎక్స్‌లో 4కిలోవాట్ పీక్ మోటార్‌ ఉంది. ఈ మోటారు 85కెఎమ్‌పిహెచ్ వేగంతో, 150కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ఇందులో IP67-సర్టిఫైడ్ తొలగించగల 3.24కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ బ్యాటరీని కేవలం 80 నిమిషాల్లో 80శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. అయితే ప్రామాణిక హోమ్ ఛార్జర్‌తో 3 గంటల 30 నిమిషాల్లో 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

మోటార్‌సైకిల్‌లో LED హెడ్‌లైట్లు ,LED టైల్‌లైట్లు, CBS బ్రేకింగ్ సిస్టమ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు, రివర్స్ మోడ్‌తో పాటు మూడు రైడింగ్ మోడ్‌ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను రెండు కలర్ ఆప్షన్‌లలో కొనచ్చు. వీటిలో స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్, ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ ఉన్నాయి.

ఆర్‌వి బ్లేజ్‌ఎక్స్‌ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్స్, 4G టెలిమాటిక్స్‌, మొబైల్ కనెక్టివిటీ, జీపీఎస్, 6-అంగుళాల LCD డిజిటల్ క్లస్టర్, రైడ్ డేటా, రిమోట్ మానిటరింగ్ ఉన్నాయి. ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్, అండర్ సీట్ ఛార్జర్ కంపార్ట్‌మెంట్ వంటి ఎలిమెంట్స్ రైడర్ సౌలభ్యాన్ని పెంచుతాయి.

Tags:    

Similar News