Renault Kwid : మారుతి ఆల్టోకు షాక్..క్రేజీ లుక్స్, అదిరిపోయే ఫీచర్లతో రూ4.30 లక్షలకే సూపర్ కార్
మారుతి ఆల్టోకు షాక్..క్రేజీ లుక్స్, అదిరిపోయే ఫీచర్లతో రూ4.30 లక్షలకే సూపర్ కార్
Renault Kwid : మధ్యతరగతి ప్రజల కారు, బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీల్ ఇచ్చే రెనాల్ట్ క్విడ్ ఇప్పుడు సరికొత్త అవతారంలో ముస్తాబవుతోంది. ఇప్పటికే ట్రైబర్, కైగర్ వంటి మోడళ్లను అప్‌డేట్ చేసిన రెనాల్ట్ సంస్థ, తన అత్యంత చౌకైన కారు క్విడ్‌ను కూడా గ్రాండ్ లుక్‌లో తీసుకురావడానికి సిద్ధమైంది. ఇటీవల ఈ కారుకు సంబంధించిన కొత్త వెర్షన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించడంతో ఆటోమొబైల్ మార్కెట్లో సందడి మొదలైంది. ఇది నేరుగా మారుతి సుజుకి ఆల్టో వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కొత్త క్విడ్ ఫొటోలను చూస్తే, దీని ఫ్రంట్ డిజైన్, బ్యాక్ లైట్లలో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దీని ఫేస్ ఇప్పుడు రెనాల్ట్ కైగర్ ఎస్‌యూవీ తరహాలో మరింత స్టైలిష్‌గా ఉండబోతోంది. సన్నని ఎల్‌ఈడీ లైట్లు, పవర్‌ఫుల్ గ్రిల్, వెనుక భాగంలో సరికొత్త లోగోతో ఈ కారు రోడ్డుపై ట్రెండీగా కనిపించనుంది. ఒక చిన్న కారును కొంటున్నామనే ఫీలింగ్ కాకుండా, ఒక చిన్న ఎస్‌యూవీని నడుపుతున్నామనే ఫీలింగ్‌ను ఇది కల్పించనుంది.
కేవలం బయటి డిజైన్ మాత్రమే కాదు, కారు ఇంటీరియర్ కూడా కంపెనీ పలు మార్పులు చేస్తోంది. కారు సీట్ల కలర్, క్వాలిటీ మార్చడంతో పాటు, డాష్ బోర్డులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, డ్రైవర్ కోసం కొత్త డిజిటల్ మీటర్ (ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్) కూడా ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ సెన్సార్స్, పవర్ విండోస్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అవసరమైన ఫీచర్లు ఇందులో కొనసాగుతాయి.
ఇంజిన్ విషయంలో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. నగర ప్రయాణాలకు ఎంతో అనువైన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులోనూ వాడుతున్నారు. ఇది 68 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. మైలేజీ గురించి ఆలోచించే వారికోసం కంపెనీ దీనిని సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి తెస్తోంది.
ప్రస్తుతం భారత్‌లో చిన్న కార్ల డిమాండ్ కొద్దిగా తగ్గినప్పటికీ, కొత్త హంగులతో క్విడ్‌ను విడుదల చేసి మార్కెట్లో తన పట్టును నిలబెట్టుకోవాలని రెనాల్ట్ చూస్తోంది. ధర పరంగా చూస్తే ఇది దాదాపు రూ.4.30 లక్షల ప్రారంభ ధరతో ఉండే అవకాశం ఉంది. ఈ సరికొత్త రెనాల్ట్ క్విడ్ మోడల్ 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.