Toyota bZ3X: ఈ టయోటా కారు కొనడానికి జనాలు ఎగబడుతున్నారు.. బుకింగ్ సిస్టమ్‌ క్రాష్..!

Update: 2025-03-09 07:30 GMT

Toyota bZ3X: టయోటా bZ3X చైనీస్ మార్కెట్లో అద్భుతంగా పని చేస్తోంది. కంపెనీ ఇటీవలే ఈ ఎస్‌యూవీని విక్రయాలను ప్రారంభించింది. విక్రయాల ప్రారంభం నుంచే చైనా మార్కెట్‌లో కలకలం సృష్టించింది. GAC టయోటా భాగస్వామ్యంతో విడుదల చేసిన bZ3X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఒక గంటలోపు 10,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకుంది. దీని ధర దాదాపు 13 లక్షల రూపాయల నుండి మొదలవుతుంది. వినియోగదారులు కొనేందుకు ఎగబడటానికి కారణం ఇదే. bZ3X కోసం డిమాండ్ టయోటా బుకింగ్ సిస్టమ్‌ను క్రాష్ చేసింది.

టయోటా మొదటి చైనాయేతర బ్రాండ్ కూడా. bZ3X ఈవీ 430 ఎయిర్,430 ఎయిర్+ వేరియంట్స్‌లో 50.03 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 430కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మరోవైపు, 520 ప్రో , 520 ప్రో+ వేరియంట్స్‌లో 58.37 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520కిమీల రేంజ్‌ను అందిస్తుంది. దీని టాప్-స్పెక్ 610 మ్యాక్స్ ట్రిమ్ 67.92 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 610కిమీల రేంజ్‌ను అందిస్తుంది.

ఎయిర్, ప్రో మోడల్స్ 204 బిహెచ్‌పి సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తాయి. అయితే మాక్స్ మోడల్‌లో 224 బిహెచ్‌పి సింగిల్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. టయోటా bZ3X పొడవు 4,600మిమీ, వెడల్పు 1,875మిమీ, ఎత్తు 1,645మిమీ. వీల్ బేస్ 2,765మిమీ పొడవు ఉంది. అలానే ఎలిజెంట్ ఎల్ఈడీ లైటింగ్ ఎలిమెంట్స్, పెద్ద వీల్స్, స్ట్రాంగ్ లుకింగ్ బాడీ క్లాడింగ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, క్రోమ్ హైలైట్స్, ఫ్రంట్ రైట్ క్వార్టర్ ప్యానెల్‌లో ఛార్జింగ్ పోర్ట్, రూఫ్,పిల్లర్‌లకు బ్లాక్‌నెడ్ ఎఫెక్ట్ ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కారులో స్వయంప్రతిపత్త డ్రైవింగ్ ఫీచర్‌ల కోసం కారు LiDAR సెన్సార్‌ని కలిగి ఉండే విండ్‌షీల్డ్ పైన బల్బ్ ఉంది. ఇందులో 11 కెమెరాలు, 12 అల్ట్రాసోనిక్ రాడార్లు, 3 ఎంఎం వేవ్ రాడార్, ఒక లిడార్ ఉన్నాయి. వీటన్నింటినీ ఎన్విడియా డ్రైవ్ AGX ఓరిన్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో 14.6-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 8.8-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, 11-స్పీకర్ యమహా సౌండ్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, లగ్జరీ ఇంటీరియర్ ఉన్నాయి. బేస్ 430 ఎయిర్ కోసం ధరలు CNY 109,800 (దాదాపు రూ. 13 లక్షలు) నుండి ప్రారంభమవుతాయి. CNY 159,800 (దాదాపు రూ. 19 లక్షలు) వరకు ఉంటాయి.

Tags:    

Similar News