Toyota Camry Discount: ఈ కారుపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.7 లక్షల డిస్కౌంట్..!
Toyota Camry Discount: టయోటా క్యామ్రీని కొనుగోలుపై రూ. 7 లక్షల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది.
Toyota Camry Discount
Toyota Camry Discount: సెడాన్ కార్లకు భారతీయ కస్టమర్లలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మీరు కూడా రాబోయే కొద్ది రోజుల్లో కొత్త సెడాన్ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే, మీకు గొప్ప శుభవార్త ఉంది. జపనీస్ దిగ్గజ కార్ల తయారీ సంస్థ టయోటా సెప్టెంబర్ 2024లో తన ప్రీమియం సెగ్మెంట్ సెడాన్ కామ్రీపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది.
మీరు సెప్టెంబర్ నెలలో టయోటా క్యామ్రీని కొనుగోలు చేస్తే మీకు రూ. 7 లక్షల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. డిస్కౌంట్‌ల గురించి మరింత సమాచారం కోసం కస్టమర్‌లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. టయోటా క్యామ్రీ ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే టయోటా క్యామ్రీలో 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో గరిష్టంగా 218bhp పవర్ ఉత్పత్తి చేయగలదు. కారు ఇంజిన్‌తో పాటు CBT గేర్‌బాక్స్ ఎంపికను కలిగి ఉంది. అయితే కారులో స్పోర్ట్, ఎకో, నార్మల్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లు ఉంటాయి. ప్రస్తుతం భారతదేశంలో 5 సీటర్ టయోటా క్యామ్రీకి ప్రత్యక్ష పోటీదారు ఎవరూ లేరు.
మరోవైపు టయోటా క్యామ్రీ లోపలి భాగంలో 10-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, మూడు జోన్ క్లైమేట్ కంట్రోల్, 9 స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. ఇది కాకుండా ఈ కారులో ప్రయాణీకుల భద్రత కోసం 9 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా అందించబడ్డాయి. భారత మార్కెట్లో టయోటా క్యామ్రీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 46.17 లక్షలు.