Ola New Scooter: ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది.. ఫీచర్లు, సేఫ్టీ నెక్స్ట్ లెవల్
Ola New Scooter: ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి వేగంగా సన్నాహాలు చేస్తోంది.
Ola New Scooter: ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది.. ఫీచర్లు, సేఫ్టీ నెక్స్ట్ లెవల్
Ola New Scooter: ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి వేగంగా సన్నాహాలు చేస్తోంది. జనవరి 31న అంటే, ఈరోజు కంపెనీ తన కొత్త స్కూటర్‌ను జనరేషన్ 3 ప్లాట్‌ఫామ్ ఆధారంగా విడుదల చేసింది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొత్త స్కూటర్‌కు కొత్త లుక్, సేఫ్టీ ఇవ్వడంలో ఈ ప్లాట్‌ఫామ్ చాలా సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. కొత్త జనరేషన్ 3 ప్లాట్‌ఫామ్‌లో మాగ్నెట్-లెస్ మోటార్, ఇంటిగ్రేటెడ్ సింగిల్ బోర్డ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి.
కొత్త జనరేషన్ 3 ప్లాట్‌ఫామ్ విషయానికొస్తే... మధ్యలో 'ఇన్‌సైడ్ ది బాక్స్' ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఈ బాక్స్ మోటారు, బ్యాటరీ, ఎలక్ట్రానిక్‌లను ఒకే దానిలో ఉండేలా చేస్తుంది. అలానే బాక్స్‌లో మేడ్ ఇన్ ఇండియా 4680 బ్యాటరీ సెల్‌లను ఉపయోగించి అత్యాధునిక బ్యాటరీ వ్యవస్థ ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన బ్యాటరీలు ఎక్కువ రేంజ్ అందించడమే కాకుండా, వాటి లైఫ్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది. స్కూటర్‌లో ఉండే మాగ్నెట్‌లెస్ మోటార్ మెరుగైన టార్క్‌ను అందిస్తుంది.
జనరేషన్ 3 ప్లాట్‌ఫామ్‌లో తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో బెటర్ పర్ఫామెన్స్ చూడొచ్చు. అదనంగా ఈ స్కూటర్‌లో మల్టీ-కోర్ ప్రాసెసర్ చేర్చారు. ఈ మల్టీ-కోర్ ప్రాసెసర్ కారణంగా, చాలా వైరింగ్ కనిపించదు. స్కూటర్‌లోని సెంట్రల్ కంప్యూట్ బోర్డ్ పవర్ పరంగా ద్విచక్ర వాహనాల కోసం ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్స్ బోర్డులకు భిన్నంగా ఉంటుంది. కంపెనీ భవిష్యత్తులో అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌తో సహా సాంకేతికతను మరింత అభివృద్ధి చేయనుంది. అంతేకాకుండా స్కూటర్ కొత్త డిజైన్ ధరను 20 శాతం తగ్గించవచ్చని భావిస్తున్నారు.
కొత్త స్కూటర్‌లో సరికొత్త డిజైన్, ఫీచర్లు కనిపిస్తాయి. ఈ స్కూటర్ ఆధారంగా, కంపెనీ మరోసారి ఎలక్ట్రానిక్ వెహికిల్స్ విభాగంలో పట్టును పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా ఎలక్ట్రిక్ విక్రయాలు చాలా తక్కువగా ఉన్నాయి. నాణ్యత లేని స్కూటర్లు, సరైన కస్టమర్ సర్వీస్ ఉండటం లేదనే ఆరోపణలు రావడంతో వినియోగదారులు కూడా ఈ స్కూటర్లను కొనేందుకు దూరంగా ఉంటున్నారు.