MG Windsor Best Selling EV: రికార్డ్ సృష్టించిన సేల్స్.. ఈ కారును నాలుగు నెలల్లో 15,000 మంది కొన్నారు..!
MG Windsor Best Selling EV: గత ఏడాది అక్టోబర్‌లో ఎంజీ తన కొత్త ఎలక్ట్రిక్ కారు విండ్సర్‌ను విడుదల చేసింది.
MG Windsor Best Selling EV: రికార్డ్ సృష్టించిన సేల్స్.. ఈ కారును నాలుగు నెలల్లో 15,000 మంది కొన్నారు..!
MG Windsor Best Selling EV: గత ఏడాది అక్టోబర్‌లో ఎంజీ తన కొత్త ఎలక్ట్రిక్ కారు విండ్సర్‌ను విడుదల చేసింది. కేవలం 4 నెలల్లో సేల్స్‌లో కొత్త రికార్డ్ సృష్టించింది. విండ్సర్ నాలుగు నెలల్లో 15,000 మంది కస్టమర్‌లను సంపాదించుకుంది. విండర్స్ తన విభాగంలో సూపర్‌హిట్ ఈవీగా నిలిచింది.
గత నెలలో ఎంజీ విండ్సర్ ఈవీ ధర పెరిగింది. విండర్స్ బేస్ వేరియంట్ ఎక్సైట్ 38కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 14 లక్షలుగా మారింది. అదే సమయంలో రెండవ వేరియంట్ ఎక్స్‌క్లూజివ్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 15 లక్షలుగా మారింది. విండ్సర్ టాప్ ఎసెన్స్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ. 16 లక్షలకు చేరింది.
ఎంజీ విండ్సర్ ఈవీ 45కిలోవాట్ DC ఛార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 38కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 332 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సహాయంతో బ్యాటరీ కేవలం 55 నిమిషాల్లో 10శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ చేయచ్చు. విండ్సర్ ఈవీలో 604 లీటర్ల పెద్ద బూట్ స్పేస్ ఉంది.ఈ కారులో సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మరే ఇతర కారులో మీకు అలాంటి విలాసవంతమైన సీట్లు కనిపించవు.
విండ్సర్ ఈవీలో పెద్ద 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ టచ్ స్క్రీన్ మీ డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తుంది. అంతేకాకుండా ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీ-లెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. ఈ కారులో సేఫ్టీ ఫీచర్లకు ఎలాంటి లోటు లేదు, ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. దూర ప్రయాణాలకు ఇంతకంటే మెరుగైన ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం లేదు.