MG Windsor EV: మతిపోగొడుతున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. సేల్స్ రికార్డులే రికార్డులు
MG Windsor EV: మతిపోగొడుతున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. సేల్స్ రికార్డులే రికార్డులు
MG Windsor EV: ఎంజీ మోటార్స్ ఇండియా కొద్ది నెలల క్రితం 'విండ్సర్ ఈవీ'ని గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కారు డిజైన్, ఫీచర్లు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎంజీ కంపెనీ ప్రతి నెలా సగటున 3,000 యూనిట్లకు పైగా 'విండ్సర్' ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఈ క్రమంలో ఎంజీ ఎలక్ట్రిక్ కార్లకు టాటా, మహీంద్రా కంపెనీలు గట్టి పోటీదారులుగా మారుతున్నాయి.
ఎంజీ మోటార్ ఇండియా జనవరిలో విండ్సర్ 3,277 యూనిట్లను విక్రయించింది. అదేవిధంగా డిసెంబర్ 2024లో 3,785 యూనిట్లు, నవంబర్‌లో 3,144 యూనిట్లు, అక్టోబర్‌లో 3,116 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.13.99 లక్షల నుంచి మొదలై రూ.15.99 లక్షల వరకు ఉంటుంది. ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు వేరియంట్‌లలో విండ్సర్ ఈవీ అందుబాటులో ఉంది. అలానే, స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో ఈ కారు అందుబాటులో ఉంది.
కారులో 38 కిలోవాట్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ 134 బిహెచ్‌పి హార్స్ పవర్, 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే సింగిల్-ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్‌టీరియర్‌లో స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ లైట్ బార్‌లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కారులో ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.
ఈ కారు ఇంటీరియర్‌లో 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎంజీ విండ్సర్ ఈవీ సేఫ్టీ విషయానికి వస్తే.. ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.