MG Majestor : ఎంజీ మెజెస్టర్ బుకింగ్స్ షురూ..రూ.41 వేలు కడితే చాలు, మీ ఇంటికి లగ్జరీ SUV

ఎంజీ మెజెస్టర్ బుకింగ్స్ షురూ..రూ.41 వేలు కడితే చాలు, మీ ఇంటికి లగ్జరీ SUV

Update: 2026-02-13 05:00 GMT

MG Majestor : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లోకి మరో పవర్పుల్ ఎస్‌యూవీ అడుగుపెట్టింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన సరికొత్త ప్రీమియం మోడల్ ఎంజీ మెజెస్టర్‎ను అధికారికంగా పరిచయం చేసింది. అదిరిపోయే లుక్స్, లగ్జరీ ఫీచర్లతో రాబోతున్న ఈ కారుకు సంబంధించి బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. కేవలం రూ.41,000 చెల్లించి ఈ కారును ఇప్పుడే రిజర్వ్ చేసుకోవచ్చు. ఎంజీ మోటార్స్ ఈ కారును మూడు ప్రధాన వేరియంట్లలో తీసుకువస్తోంది - షార్ప్, సావీ, సావీ 4X4. ఇది 6 సీట్లు, 7 సీట్ల ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ప్రీ-బుకింగ్ చేసుకునే మొదటి 3,000 మంది కస్టమర్లకు కంపెనీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. వారికి 5 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ, 5 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 5 ఏళ్ల పాటు ఉచిత లేబర్ సర్వీస్ లభిస్తాయి. ఏప్రిల్‌లో ధరల ప్రకటన ఉండి, మే 2026 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.

మెజెస్టర్‌లో అత్యంత శక్తివంతమైన 2.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ అమర్చారు. ఇది 215 BHP పవర్, 478 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేశారు. ఇందులో ఉన్న M-Hub ఫీచర్ ద్వారా డ్రైవర్ 10 రకాల డ్రైవింగ్ మోడ్స్ (రోడ్డు పరిస్థితులను బట్టి) ఎంచుకోవచ్చు. అలాగే ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం ఇందులో M-Crawl ఫంక్షన్, త్రీ డిఫరెన్షియల్ లాక్స్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు లోపల అడుగుపెడితే ఏదో ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది.

డిస్‌ప్లే: 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.

సౌండ్: 12 స్పీకర్లతో కూడిన JBL ఆడియో సిస్టమ్ థియేటర్ లాంటి అనుభూతిని ఇస్తుంది.

కంఫర్ట్: డ్రైవర్ సీటుకు హీటింగ్, కూలింగ్, మసాజ్ ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ: లెవల్-2 ADAS టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పిస్తాయి.

ఎంజీ గ్లోస్టర్ కంటే ఇది మరింత స్పోర్టీగా, భారీగా కనిపిస్తుంది. ఫ్రంట్ గ్రిల్ డిజైన్ సరికొత్తగా ఉంది. 19 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కారుకు మంచి లుక్ ఇస్తున్నాయి. వెనుక వైపున ఉన్న కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ రాత్రి వేళల్లో మెజెస్టర్‌కు ప్రత్యేక గుర్తింపునిస్తాయి. ఈ కారు మెటల్ యాష్, పర్ల్ వైట్, మెటల్ బ్లాక్, కాంక్రీట్ గ్రే వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది.

Tags:    

Similar News