MG Motor: 3.2 సెకన్లలో 100కి దూసుకెళ్లే ఎలక్ట్రిక్ కారు.. ఎంజీ సైబర్‌స్టర్ వచ్చేసింది!

MG Motor: ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల కొత్త ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ లగ్జరీ ఎంపీవీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ జూలై 25, 2025న ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

Update: 2025-07-25 06:30 GMT

MG Motor: 3.2 సెకన్లలో 100కి దూసుకెళ్లే ఎలక్ట్రిక్ కారు.. ఎంజీ సైబర్‌స్టర్ వచ్చేసింది!

MG Motor: ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల కొత్త ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ లగ్జరీ ఎంపీవీని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ జూలై 25, 2025న ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంజీ సైబర్‌స్టర్ కొత్త ఎంజీ సెలెక్ట్ సబ్‌బ్రాండ్‌లో రెండవ ప్రొడక్టుగా వస్తుంది. మొదటిది ఎం9. సైబర్‌స్టర్ కోసం ప్రీ-బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ కారును కొనాలనుకుంటే, కేవలం రూ. 51,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. బుకింగ్‌లు ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని 13 ఎంజీ సెలెక్ట్ డీలర్‌షిప్‌ల ద్వారా లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు.

ఎంజీ సైబర్‌స్టర్‌ను మొదటిసారి 2021లో చూపించారు. 2023లో గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో కూడా దీనిని ప్రదర్శించారు. ఇది 2017 ఇ-మోషన్ కూపే కాన్సెప్ట్ ఆధారంగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఈ ఎలక్ట్రిక్ కారులో డీఆర్‌ఎల్‌లతో కూడిన స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, స్టైలిష్ బోనెట్, స్ప్లిట్ ఎయిర్ ఇన్‌టేక్ ఉన్నాయి. వెనుక భాగంలో, ఇందులో బాణం ఆకారంలో ఉండే టెయిల్‌లైట్లు, స్ప్లిట్ డిఫ్యూజర్ ఉన్నాయి. సైబర్‌స్టర్ సైడ్ ప్రొఫైల్‌లో ఫార్ప్ కట్స్, క్రీజ్‌లు ఉన్నాయి. అలాగే 19 నుండి 20 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. దీనికి యూనిక్ డోర్స్ ఉన్నాయి. ఈ కారు పొడవు 4,533 మిమీ, వెడల్పు 1,912 మిమీ, ఎత్తు 1,328 మిమీ, వీల్‌బేస్ 2,689 మిమీ.

కారు లోపల మూడు స్క్రీన్‌లు ఉన్నాయి. ఇందులో డ్రైవర్ వైపు వంగిన ఒక నిలువుగా ఉండే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, ఇన్ బిల్డ్ 5జీ, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం బోస్ ఆడియో సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8155 చిప్, రీజనరేటివ్ బ్రేకింగ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 ADAS వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

భారతదేశంలో విడుదలయ్యే ఎంజీ సైబర్‌స్టర్‌లో 77kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది, దీని మందం కేవలం 110 మిమీ. ఇది రెండు ఆయిల్-కూల్డ్ ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. ఇవి ఒక్కొక్కటి ఒక యాక్సిల్‌పై ఉండి, మొత్తం 510hp శక్తిని, 725Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు కేవలం 3.2 సెకన్లలో 0 నుండి 100kph వేగాన్ని అందుకోగలదు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ కారు గరిష్టంగా 580 కి.మీ.ల రేంజ్ ఇస్తుంది.

Tags:    

Similar News