MG Comet EV Discount: కామెట్ ఈవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..!

MG Comet EV Discount: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా ఏప్రిల్‌లో తన కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.

Update: 2025-04-07 07:55 GMT

MG Comet EV Discount: కామెట్ ఈవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజే వేరబ్బా.. సింగిల్ ఛార్జ్‌తో 230కి.మీ దూసుకెళ్తుంది..!

MG Comet EV Discount: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ఇండియా ఏప్రిల్‌లో తన కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ తన ఎంట్రీ లెవల్,దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కామెట్ ఈవీపై గొప్ప తగ్గింపులను అందించింది. ఈ కారు మోడల్ ఇయర్ 2024 , మోడల్ ఇయర్ 2025పై కంపెనీ విభిన్న డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ నెలలో మీరు కారు కొనుగోలుపై రూ.45,000 వరకు తగ్గింపు పొందుతారు. ఈ కారు అన్ని వేరియంట్లపై కంపెనీ డిస్కౌంట్లను ఇస్తోంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే అది 230కిమీల రేంజ్ ఇస్తుంది.

MG Comet EV Offers

కంపెనీ కామెట్ ఎక్స్‌క్లూజివ్‌పై రూ. 20,000 క్యాష్, రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ బోనస్‌లను అందిస్తోంది. ఈ విధంగా ఈ వేరియంట్‌పై రూ. 45,000 తగ్గింపు అందుబాటులో ఉంది. కామెట్ ఎక్స్‌క్లూజివ్‌ ఎఫ్‌సీ, ఎక్సైట్ ఎఫ్‌సీ వేరియంట్‌లపై రూ. 15,000 క్యాష్‌బ్యాక్, రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ బోనస్‌లను అందిస్తోంది. ఈ విధంగా, ఈ వేరియంట్‌పై రూ. 40,000 తగ్గింపు లభిస్తుంది. కామెట్ ఎక్సైట్, 100ఇయర్స్ ఎడిషన్ వేరియంట్‌పై రూ. 10,000 క్యాష్ బ్యాక్, రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ బోనస్‌లను అందిస్తోంది. ఈ విధంగా ఈ వేరియంట్‌పై రూ. 35,000 తగ్గింపు అందుబాటులో ఉంది.

ఇప్పుడు ఎంజీ కామెట్ ఈవీ (MY2025)పై అందుబాటులో ఉన్న డిస్కౌంట్ల విషయానికి వస్తే కంపెనీ కామెట్ ఎక్స్‌క్లూజివ్, ఎక్సైట్ ఎఫ్‌సీ, ఎక్స్‌క్లూజివ్ ఎఫ్‌సీ వేరియంట్‌లపై రూ. 15,000 క్యాష్, రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ బోనస్‌ను అందిస్తోంది. ఈ విధంగా ఈ వేరియంట్‌పై రూ. 40,000 తగ్గింపు లభిస్తుంది. కామెట్ ఎక్సైట్ వేరియంట్‌పై రూ. 15,000 క్యాష్ బ్యాక్, రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ. 5,000 కార్పొరేట్ బోనస్‌లను అందిస్తోంది. ఈ విధంగా, ఈ వేరియంట్‌పై రూ. 40,000 తగ్గింపు లభిస్తుంది.

MG Comet EV Features And Specifications

కామెట్ ఈవీ పొడవు 2974మిమీ, వెడల్పు 1505మిమీ, ఎత్తు 1640మిమీ. దీని వీల్ బేస్ 2010ఎమ్ఎమ్. టర్నింగ్ వ్యాసార్థం కేవలం 4.2 మీటర్లు, ఇది రద్దీగా ఉండే రోడ్లపై డ్రైవింగ్ చేయడానికి లేదా ఇరుకైన ప్రదేశాలలో పార్కింగ్ చేయడానికి ఒక వరం. ఎంజీ కామెట్ ఈవీ క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, పూర్తి వెడల్పు ఎల్అడీ స్ట్రిప్, సొగసైన హెడ్‌ల్యాంప్‌లతో ఉంటుంది. ఇందులో పెద్ద డోర్లు, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ఫ్లాట్ రియర్ సెక్షన్ ఉన్నాయి. ఇందులో 10.25-అంగుళాల స్క్రీన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి.

మ్యూజిక్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వెదర్ అప్‌డేట్స్, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్లను అందిస్తుంది. ఎంజీ కామెట్ ఈవీని బే, సెరినిటీ , సన్‌డౌనర్, ఫ్లెక్స్ 4 రంగులలో కొనుగోలు చేయచ్చు.ఎంజీ కామెట్ ఈవీ జీఎస్‌ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. పట్టణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. అయితే, కారు దాని కాంపాక్ట్ సైజు కారణంగా కొంచెం పెళుసుగా కనిపించవచ్చు. దీని టైర్ పరిమాణం 145/70తో 12-అంగుళాలు. ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి, వెనుకవైపు డ్రమ్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.7 లక్షల నుండి రూ.9.81 లక్షల వరకు ఉన్నాయి.

Tags:    

Similar News