Maruti Brezza: బ్రెజ్జాలో ఊహించని మార్పులు.. ధర భారీగా తగ్గే ఛాన్స్..!

Cheapest Maruti Brezza: దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతి సుజుకి ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ బ్రెజ్జాను మరింత సరసమైనదిగా మార్చాలని ఆలోచిస్తోంది.

Update: 2025-03-01 09:58 GMT

Maruti Brezza: బ్రెజ్జాలో ఊహించని మార్పులు.. ధర భారీగా తగ్గే ఛాన్స్..!

Cheapest Maruti Brezza: దేశంలోని అతిపెద్ద కార్ కంపెనీ మారుతి సుజుకి ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ బ్రెజ్జాను మరింత సరసమైనదిగా మార్చాలని ఆలోచిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. కంపెనీ బ్రెజ్జా ఇంజిన్‌లో మార్పులు చేయనుంది. ప్రస్తుత బ్రెజ్జాలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, అయితే ఇప్పుడు ఈ SUVలో కొత్త అధునాతన పెట్రోల్ ఇంజన్‌ను తీసుకురానుంది. కొత్త బ్రెజ్జాలో ఎలాంటి మార్పులను చూడచ్చో తెలుసుకుందాం.

మారుతి సుజుకి గత ఏడాది కొత్త స్విఫ్ట్, డిజైర్‌లను విడుదల చేసింది. రెండు కార్లలో కొత్త 1.2-లీటర్ మూడు-సిలిండర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. ఇప్పుడు అదే ఇంజన్ కొత్త బ్రెజ్జాలో తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇంజిన్ పవర్, టార్క్‌లో కొన్ని మార్పులు కనిపించవచ్చు. చిన్న ఇంజిన్ కారణంగా వాహనం ధర కూడా తగ్గచ్చు.

1.5L పెట్రోల్ ఇంజన్‌తో బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.69 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే ఈ ఎస్‌యూవీ కొత్త 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లో వస్తే దాని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 7.49 లక్షలు కావచ్చు. అలాగే దీని మైలేజీ లీటరుకు 22-23 కిమీ. కొత్త బ్రెజ్జా ఇప్పటికే ఉన్న మహీంద్రా XUV 3XO, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్‌లకు గట్టీ పోటీనిస్తుంది.

కొత్త బ్రెజ్జాలో చిన్న ఇంజన్‌ చేర్చినా.. ఈ వాహనంలో భద్రతా ఫీచర్స్‌లో ఎలాంటి కొరత ఉండదు. 6 ఎయిర్ బ్యాగ్స్‌తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ, బ్లైండ్ వ్యూ మిర్రర్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్డ్ వంటి ఫీచర్లను బ్రెజ్జాలో చూడచ్చు.

కొత్త మోడల్‌లో అడాస్ లెవెల్ 2 సేఫ్టీ ఫీచర్‌ని కూడా ఇవ్వచ్చు. ఈ ఫీచర్ దాని టాప్ మోడల్‌లో మాత్రమే ఉంటుంది. ప్రస్తుతానికి మారుతి సుజుకి నుండి కొత్త బ్రెజ్జా, దానిలో అందుబాటులో ఉన్న ఇంజన్లకు సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదు. మారుతి త్వరలో 1.2-లీటర్ Z12 E పెట్రోల్ ఇంజన్‌ను కొత్త టర్బో కిట్‌ను కార్లలో చేర్చవచ్చు.

Tags:    

Similar News