Maruti Suzuki: భారత్‌లోనే కాదు.. జపాన్‌లోనూ జెండా ఎగురేసిన మారుతి.. అదుర్స్ అనిపించిన రూ.7.54 లక్షల కారు
Maruti Suzuki: మనదేశంలో నెంబర్ వన్ కార్ కంపెనీ అయిన మారుతి సుజుకి ఇండియా, కార్లను ఎగుమతి చేయడంలోనూ టాప్‌లో ఉంది.
Maruti Suzuki : భారత్‌లోనే కాదు.. జపాన్‌లోనూ జెండా ఎగురేసిన మారుతి.. అదుర్స్ అనిపించిన రూ.7.54లక్షల కారు
Maruti Suzuki : మనదేశంలో నెంబర్ వన్ కార్ కంపెనీ అయిన మారుతి సుజుకి ఇండియా, కార్లను ఎగుమతి చేయడంలోనూ టాప్‌లో ఉంది. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల్లో మారుతి కార్లు తమ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి జపాన్ కూడా చేరింది. అక్కడ మారుతికి చెందిన రూ.7.54 లక్షల ఎస్‌యూవీ అదరగొట్టేసింది. ఆ కారు మారుతి ఫ్రాంక్స్. గత సంవత్సరం ఇండియా నుంచి ఎక్కువగా ఎగుమతి అయిన కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారు జపాన్‌లో జరిగిన క్రాష్ టెస్ట్‌లో అదిరిపోయే సేఫ్టీ రేటింగ్ సాధించింది.
జపాన్ ఎన్‌క్యాప్ సేఫ్టీ రేటింగ్
జపాన్ ఎన్‌క్యాప్ (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) మారుతి సుజుకి ఫ్రాంక్స్‌కు క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్ట్‌లో ఫ్రాంక్స్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ కారును ఇండియాలోనే తయారు చేశారు. అయితే ఇది ఇండియాలో అమ్ముడవుతున్న మారుతి ఫ్రాంక్స్ కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. జపాన్ మార్కెట్, సెక్యూరిటీ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కారులో కొన్ని అదనపు సేఫ్టీ ఫీచర్లను కూడా చేర్చారు.
మారుతి ఫ్రాంక్స్‌కు ముందు, ఇండియాలో తయారైన మారుతి స్విఫ్ట్ కూడా గతేడాది జపాన్‌లో జరిగిన క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. దీనితో పాటు కంపెనీ డిజైర్‌కు భారత్ ఎన్‌క్యాప్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెడుతూ, మారుతి సుజుకి ఇప్పుడు ఇండియాలో తన ప్రతి కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందించనున్నట్లు ప్రకటించింది.
దుమ్మురేపే కారు మారుతి ఫ్రాంక్స్
మారుతి ఫ్రాంక్స్ ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇది బాలెనో ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లు ఉన్నాయి. కంపెనీ ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తుంది. ఇది 89.73 పీఎస్ పవర్‌ను, 113 న్యూటన్ మీటర్ల పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటరుకు 22.89 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
మారుతి సుజుకి ఎగుమతులు
మారుతి సుజుకి ఇండియాలో సుజుకి కార్పొరేషన్ జపాన్‌కు చెందిన కంపెనీనే. ఇండియాలో ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండటం వల్ల సుజుకి జపాన్ కోసం కూడా చాలా కార్లను ఇక్కడే తయారు చేయిస్తుంది. వాటిని ఇక్కడి నుండి ఎగుమతి చేస్తుంది. నిజానికి సుజుకి కార్పొరేషన్ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని 1983 నుంచే మనదేశంలో చేస్తోంది. గత సంవత్సరం కంపెనీ దాదాపు 3 లక్షల కార్లను ఎగుమతి చేసింది. ఇది ఇప్పటివరకు దాని అత్యధిక ఎగుమతి సంఖ్య.