Maruti Suzuki Eeco: భారీగా పెరిగిన ఈకో ధర.. ఎందుకో తెలుసా?
Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఇండియా కంపెనీకి చెందిన అన్నీ కార్ల ధరలను ఫిబ్రవరి 1, 2025 నుండి పెంచబోతోంది.
Maruti Suzuki Eeco: భారీగా పెరిగిన ఈకో ధర.. ఎందుకో తెలుసా?
Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఇండియా కంపెనీకి చెందిన అన్నీ కార్ల ధరలను ఫిబ్రవరి 1, 2025 నుండి పెంచబోతోంది. పెరుగుతున్న ఇన్‌పుట్, నిర్వహణ ఖర్చుల కారణంగా ధరలను పెంచాల్సి వస్తోందని కంపెనీ ప్రకటించింది. దీంతో మారుతి సుజుకి వాహనాల్లో చౌకనై వాహనంగా పేరున్న ఈకో ధర కూడా 12000 రూపాయలు పెరిగింది. కొత్త ధర ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం.. Eeco ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.32 లక్షల నుండి ప్రారంభమవుతోంది. జనవరి 31లోపు ఈ కారును కొంటే ఆ పెరిగే ధర మేరకు డబ్బు ఆదా అవుతుంది. ఇప్పుడు మారుతి ఈకో ఫీచర్లతో పాటు ఇతర ఆసక్తికరమైన వివరాల గురించి తెలుసుకుందాం.
మారుతీ సుజుకి గత డిసెంబర్ నెలలో 11,678 యూనిట్ల ఈకోను విక్రయించింది. 2023 డిసెంబర్ నెలలో 10,034 మారుతి ఈకో వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్యలో 102,520 ఈకో కార్లు సేల్ అయ్యాయి. ఈకో కారుకు ఏ రేంజులో డిమాండ్ ఉందనేది ఆ కార్ల అమ్మకాలు చూస్తే అర్థమవుతోంది.
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ ఈ వెహికల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను త్వరలో మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ కారు ధర రూ.5.32 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మీకు 5-7 సీటింగ్ ఆప్షన్ లభిస్తుంది. వ్యక్తిగత వినియోగంతో పాటు, ఈ కారును వ్యాపార సంబంధిత అవసరాలకు కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
మారుతి ఈకోలో 1.2L పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 81 పిఎస్ పవర్, 104 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. ఈ కారులో CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ మోడ్‌లో Eeco 20 కెఎమ్‌పిఎల్ మైలేజీని అందిస్తుంది. అయితే CNG మోడ్‌లో ఇది 27 km/kg మైలేజీని ఇస్తుంది. Eecoలో 13 రకాల వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది 5 లేదా 7 సీట్ల వేరియంట్స్‌లో వస్తుంది. ఈ కారులో స్థలానికి కొరతలేదు. లగేజీ ఉంచుకోవడానికి కూడా మీకు చాలా స్థలం ఉంటుంది. ప్రయాణికుల సేఫ్టీ విషయానికొస్తే... ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 3 పాయింట్ సీట్ బెల్ట్ ఉంటాయి.