Maruti Suzuki Fronx Hybrid: మార్కెట్‌ను షేక్ చేసేందుకు మారుతి ప్లాన్.. ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్.. 30కి.మీ మైలేజ్..!

Maruti Suzuki Fronx Hybrid: మార్కెట్‌ను షేక్ చేసేందుకు మారుతి ప్లాన్.. ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్..  30కి.మీ మైలేజ్..!
x

Maruti Suzuki Fronx Hybrid: మార్కెట్‌ను షేక్ చేసేందుకు మారుతి ప్లాన్.. ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్.. 30కి.మీ మైలేజ్..!

Highlights

Maruti Suzuki Fronx Hybrid: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఫేమస్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్‌ను తీసుకువస్తోంది. ఈ వార్త చాలా కాలంగా మార్కెట్లో వస్తూనే ఉంది కానీ కంపెనీ నుండి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు.

Maruti Suzuki Fronx Hybrid: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన ఫేమస్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్‌ను తీసుకువస్తోంది. ఈ వార్త చాలా కాలంగా మార్కెట్లో వస్తూనే ఉంది కానీ కంపెనీ నుండి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. మారుతి సుజుకి చాలా కాలంగా హైబ్రిడ్ కార్లపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఉన్న హైబ్రిడ్ మోడల్‌లు మునుపటి కంటే మెరుగ్గా ఉండటమే కాకుండా, కొన్ని కొత్త మోడల్‌లు కూడా హైబ్రిడ్‌లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఫ్రాంక్స్ హైబ్రిడ్ గురించి మాట్లాడుకుంటే, ఈ కారు ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ కావచ్చు.

Maruti Suzuki Fronx Hybrid Mileage

మారుతి ఫ్రాంక్స్‌‌లో హైబ్రిడ్ టెక్నాలజీని చేర్చిన తర్వాత, దాని వీల్స్ పెట్రోల్ ఇంజిన్‌కు బదులుగా ఎలక్ట్రిక్ మోటారుతో రన్ అవుతాయి. ఈ పెట్రోల్ పవర్‌ట్రెయిన్ బ్యాటరీ ప్యాక్‌ను రీఛార్జ్ చేయడానికి జనరేటర్‌గా పనిచేస్తుంది. దీనివల్ల ఇంధన వినియోగం తగ్గి ఎక్కువ మైలేజీ వస్తుంది. కొత్త ఫ్రాంక్స్ హైబ్రిడ్ మైలేజ్ లీటరుకు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. మారుతి ప్రస్తుతం భారతదేశంలో మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లను విక్రయిస్తోంది.

Maruti Suzuki Fronx Engine

ప్రస్తుతం ప్రాంక్స్‌ 1.2-లీటర్ K-సిరీస్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 90 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్‌తో 21.79 kmpl, AMTతో 23 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. ఇది కాకుండా, ఈ కారు CNG వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. CNG మోడ్‌లో 28.51 కి.మీ మైలేజ్ లభిస్తుంది.

Maruti Suzuki Fronx Price

మారుతి సుజికి ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.52 లక్షల నుండి రూ. 12.87 లక్షల వరకు ఉంది. హైబ్రిడ్ మోడల్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. సేఫ్టీ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, 6 ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories