కేవలం రూ.40,000తో నంబర్-1 ఫ్యామిలీ కారు.. 33కి.మీలకు మించి మైలేజీ..!
Maruti Suzki Alto K10: చాలామంది సరసమైన ధరలో ఫ్యామిలీ కారుని కోరుకుంటారు. అలాంటి కారుని అందించే ఏకైక కంపెనీ మారుతి సుజుకి మాత్రమే.
కేవలం రూ.40,000తో నంబర్-1 ఫ్యామిలీ కారు.. 33కి.మీలకు మించి మైలేజీ..!
Maruti Suzki Alto K10: చాలామంది సరసమైన ధరలో ఫ్యామిలీ కారుని కోరుకుంటారు. అలాంటి కారుని అందించే ఏకైక కంపెనీ మారుతి సుజుకి మాత్రమే. ఈ కంపెనీ దేశంలోని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలకి అనుగుణంగా కార్లని సిద్దం చేస్తుంది. మధ్య తరగతి కుటుంబాలకి సరిపోయే మారుతి కారు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ కారు పేరు మారుతి సుజుకి ఆల్టో కె10. కేవలం రూ. 40,000తో ఈ కారుని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే దీని మైలేజ్ 33 కిలోమీటర్ల కంటే ఎక్కువగా వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ధర, ఈఎంఐ
మారుతి సుజుకి ఆల్టో K10 ధర రూ.3.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.5.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మీరు ఈ కారు బేస్ వేరియంట్‌ను డౌన్ పేమెంట్‌పై కొనుగోలు చేయాలనుకుంటే ఈఎంఐ తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీరు ఈ కారును 10% డౌన్ పేమెంట్‌తో బేస్ వేరియంట్ కొనుగోలు చేస్తే సుమారు రూ. 40,000 చెల్లించి, 9.5% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు నెలకి రూ.7,500 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
ఇంజిన్, మైలేజ్
మారుతి ఆల్టో K10కి 1 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇందులో CNG కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని కారణంగా ఇంజిన్ 57 PS, 82.1 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మోడ్‌లో దీని మైలేజ్ 24.90 కిమీ/లీ వరకు వస్తుంది. అదే సిఎన్‌జితో అయితే కిలోకి 33.85 కిమీ వరకు మైలేజీని అందిస్తుంది.