Maruti Suzuki Discount: మారుతి కార్లపై భారీ డిస్కౌంట్‌.. 50 వేలకు పైగా ఆదా..!

Maruti Suzuki Discount: కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు.

Update: 2023-07-29 10:58 GMT

Maruti Suzuki Discount: మారుతి కార్లపై భారీ డిస్కౌంట్‌.. 50 వేలకు పైగా ఆదా..!

Maruti Suzuki Discount: కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకి జూలై 2023లోక్యాష్‌బ్యాక్, కార్పొరేట్ బోనస్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో సహా అనేక మోడళ్లపై మంచి ఆఫర్‌లను అందిస్తోంది. కంపెనీ వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఆల్టో, ఈకోలపై ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.

మారుతి ఆల్టో కె10పై రూ.40000 క్యాష్‌బ్యాక్ ఉంది. రూ.15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4100 కార్పొరేట్ తగ్గింపు, మొత్తం ఆఫర్ రూ.59100గా మారింది. అలాగే డిజైర్ సెడాన్‌పై రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మాత్రమే ఇస్తున్నారు. అంతేకాకుండా సెలెరియో రూ.35,000 క్యాష్‌బ్యాక్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,100 కార్పొరేట్ తగ్గింపుతో మొత్తం ఆఫర్ రూ.54,100కి చేరింది.

అలాగే ఎస్-ప్రెస్సోపై రూ.39 వేల క్యాష్‌బ్యాక్, రూ.15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4100 కార్పొరేట్ తగ్గింపు అందిస్తుంది. వ్యాగన్ఆర్‌పై రూ.30 వేలు క్యాష్‌బ్యాక్, రూ.20 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4100 కార్పొరేట్ డిస్కౌంట్ అంటే మొత్తం రూ.54100 ఆఫర్ అందిస్తుంది.

తర్వాత స్విఫ్ట్‌లో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,100 కార్పొరేట్ తగ్గింపు అందుబాటులో ఉంది. స్విఫ్ట్ పై మొత్తం రూ.49100 ఆఫర్ ఉంది. అలాగే Eecoలో రూ. 20,000 క్యాష్‌బ్యాక్, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3,100 కార్పొరేట్ తగ్గింపు మొత్తం రూ. 33,100 అందిస్తుంది. అయితే లొకేషన్, డీలర్‌షిప్ ఆధారంగా ఆఫర్‌లు మారుతాయని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News