Mahindra : తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ కారు.. మహీంద్రా XUV 3XO RevX ఎడిషన్ వస్తోంది
Mahindra: మహీంద్రా తన పాపులర్ XUV 3XO SUV లైన్‌అప్‌లో త్వరలో ఒక కొత్త వేరియంట్‌ను తీసుకురాబోతోంది.
Mahindra : తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ కారు.. మహీంద్రా XUV 3XO RevX ఎడిషన్ వస్తోంది
Mahindra: మహీంద్రా తన పాపులర్ XUV 3XO SUV లైన్‌అప్‌లో త్వరలో ఒక కొత్త వేరియంట్‌ను తీసుకురాబోతోంది. ఈ కొత్త వేరియంట్ పేరు RevX ఎడిషన్. ఇది XUV 3XOలో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో అత్యంత ప్రీమియం వెర్షన్‌గా ఉండనుంది. ఫేస్‌లిఫ్ట్ XUV 3XO మాదిరిగానే, ఈ కొత్త RevX ఎడిషన్ కూడా మరింత ఆకర్షణీయమైన డిజైన్, కొత్త ఇంటీరియర్, మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ముఖ్యంగా స్టైల్, టెక్నాలజీని ఇష్టపడే కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేశారు.
RevX ఎడిషన్‌లో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో వచ్చిన షార్ప్ డిజైన్, C-ఆకారంలో ఉండే LED DRLలు ఉంటాయి. అయితే, దీనికి కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేశారు. ఇందులో కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్, గ్రిల్, బంపర్‌పై నలుపు రంగు ఫినిషింగ్, RevX కోసం ప్రత్యేకంగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, వెనుక బంపర్‌లో మార్పులు, స్మోక్డ్ LED టెయిల్‌లైట్స్ వంటివి ఉంటాయి. ఇవన్నీ కలిసి కారుకు మరింత స్పోర్టీ లుక్ ఇస్తాయి. ఇవన్నీ యూత్ కు తెగ నచ్చేస్తాయి.
RevX వేరియంట్ ఇంటీరియర్లో గణనీయమైన మార్పులు ఉంటాయి. ఇందులో డ్యూయల్-టోన్ బ్లాక్-రెడ్ లేదా టాన్ కలర్ థీమ్ తో కూడిన ఇంటీరియర్ లభిస్తుంది. సాఫ్ట్-టచ్ డ్యాష్‌బోర్డ్, లెదరెట్ సీట్లు, కాంట్రాస్ట్ స్టిచింగ్ వంటివి కనిపిస్తాయి. దీనితో పాటు, లోపల 10.25 అంగుళాల రెండు స్క్రీన్‌లు ఉంటాయి – ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డిజిటల్ క్లస్టర్ కోసం. వీటిలో RevX కోసం ప్రత్యేకమైన ఇంటర్‌ఫే, యానిమేషన్లు ఉండవచ్చు. డ్యాష్‌బోర్డ్‌పై బ్యాక్‌లిట్ RevX లోగో కూడా ఉండొచ్చు.
XUV 3XO ఇప్పటికే ఫీచర్లతో నిండి ఉంది. కానీ RevX ఎడిషన్ దీన్ని మరింత ముందుకు తీసుకువెళుతుంది. ఇందులో హర్మాన్ కార్డాన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లభిస్తాయి. ADAS ఫీచర్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ సెంటరింగ్ అసిస్ట్, రేర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ వంటి మరింత అడ్వాన్స్‌డ్ ఆప్షన్లు ఉంటాయి. కొత్త యాంబియంట్ లైటింగ్ కలర్ థీమ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అప్‌డేటెడ్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్ కూడా ఉంటాయి.
RevX వేరియంట్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 130 bhp పవర్, 230 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుంది, ఇది 117 bhp పవర్, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్‌లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో వస్తాయి. ఈ ఇంజిన్‌ల పర్ఫామెన్స్ సిటీ, హైవే రెండింటిలోనూ అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే పేరు పొందింది.