Mahindra New Electric SUV: మహీంద్రా నుంచి కొత్త ఈవీలు.. ఎమ్‌జీకి పోటీగా లాంచ్
Mahindra New Electric SUV: మహీంద్రా తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో రెండు కొత్త మోడళ్లను తీసుకురానుంది. నివేదిక ప్రకారం కంపెనీ నవంబర్ 26న లాంచ్ చేయనుంది.
Mahindra New Electric SUV
Mahindra New Electric SUV: మహీంద్రా తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో రెండు కొత్త మోడళ్లను తీసుకురానుంది. నివేదిక ప్రకారం కంపెనీ నవంబర్ 26న లాంచ్ చేయనుంది. మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లలో లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్, మరొక ఎస్‌యూవీ ఉంటాయి. ఈ ఎస్‌యూవీలను ఆఫ్-రోడింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వీటిని చెన్నైలో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ లాంచ్ కంపెనీ మొదటి గ్రౌండ్-అప్ ఎలక్ట్రిక్ వాహనం హైలైట్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.
మహీంద్రా ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల అంచనా ధర రూ. 35 లక్షల కంటే తక్కువగా ఉండవచ్చని అంచనా. లాంచ్‌కు మద్దతుగా మహీంద్రా గ్రూప్ డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించడానికి ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసింది. అయితే టాటా మోటార్స్, ఎమ్‌జీ మోటార్స్‌తో పోటీ పడాలంటే మహీంద్రా ధరపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మహీంద్రా ఈ కొత్త ఎలక్ట్రిక్ కార్లు అధునాతన క్వాల్కమ్ చిప్‌లను కలిగి ఉంటాయి. ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి కనెక్ట్ చేసిన కార్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. వెహికల్ లాంచ్ కాకుండా మహీంద్రా గ్రూప్ ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలను కూడా ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ మోడళ్లను లాంచ్ చేయడం అనేదిఈవీ మార్కెట్‌లోని లగ్జరీ విభాగంలోకి ప్రవేశించడానికి మహీంద్రా వ్యూహంలో భాగం.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్ చేసిన తర్వాత, మహీంద్రా మొదట్లో ఎంపిక చేసిన కస్టమర్‌లను షోరూమ్‌కి మొదటగా ఆహ్వానిస్తుంది. తద్వారా వారు వాహనాలను చూడచ్చు. టెస్ట్ చేయచ్చు. కొత్త EV మోడల్ అమ్మకాలు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి.