Mahindra XUV 3XO EV: మార్కెట్‌ను దున్నేందుకు రెడీ అవుతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈవీ

Mahindra XUV 3XO EV Launch Soon: మహీంద్రా ఎస్‌యూవీకి ఇండియన్ మార్కెట్‌లో భిన్నమైన క్రేజ్ ఉంది.

Update: 2025-02-04 09:25 GMT

Mahindra XUV 3XO EV Launch Soon: మహీంద్రా ఎస్‌యూవీకి ఇండియన్ మార్కెట్‌లో భిన్నమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా కంపెనీ చౌకైన ఎక్స్‌యూవీ 3XO కాంపాక్ట్ ఎస్‌యూవీని కస్టమర్లు బాగా ఇష్టపడుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రతి నెలా సగటున 9,000 యూనిట్ల కంటే ఎక్కువ మహీంద్రా XUV 3XO అమ్ముడవుతోంది. మార్కెట్లో ఈ కారుకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కంపెనీ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

మహీంద్రా XUV 3XO EV అనేక సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఈ ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది చివరి నాటికి విడుదల చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఈవీ ధర, ఫీచర్లు, తదితర వివరాలు తెలుసుకుందాం.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈవీ ఫ్రంట్‌లో ఆకర్షణీయమైన గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్‌ను చూడవచ్చు. అలానే కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ వచ్చే అవకాశం ఉంది. రూఫ్ రైల్, రూఫ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లు కూడా టెస్టింగ్ ఇమేజ్‌లో కనిపించాయి.

అంతేకాకుండా మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈవీలో 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్‌ ఉండే అవకాశం ఉంది.

సేఫ్టీ విషయానికి వస్తే మహీంద్రా XUV 3XO ఎలక్ట్రిక్ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ వంటి ఫీచర్లు రానున్నాయి. ఈ ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ధర రూ. 10 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈవీ‌లో XUV400 మాదిరిగానే 34.5కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 375-400 కిమీల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ కారు.. టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీలతో పోటీపడుతుంది.

Tags:    

Similar News