Mahindra XUV 3XO EV: సింగిల్ ఛార్జ్‌తో 400కిమీ రేంజ్.. మహీంద్రా నుంచి కొత్త ఈవీ వచ్చేస్తోంది

Update: 2025-03-09 11:45 GMT

Mahindra XUV 3XO EV: సింగిల్ ఛార్జ్‌తో 400కిమీ రేంజ్.. మహీంద్రా నుంచి కొత్త ఈవీ వచ్చేస్తోంది

Mahindra XUV 3XO EV: హ్యుందాయ్ మోటార్ ఇండియాను అధిగమించి, మహీంద్రా దేశంలో రెండవ అతిపెద్ద కార్ కంపెనీగా అవతరించింది. మహీంద్రా విక్రయాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. గత సంవత్సరం మహీంద్రా XUV 3XO ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు కంపెనీ ఈ వాహహాన్ని ఎలక్ట్రిక్ అవతార్‌లో తీసుకొస్తోంది. ఈ వాహనంపై కంపెనీ వేగంగా పని చేస్తోంది. ఇప్పటికే మహీంద్రా XUV 3XO EVని అనేక సార్లు టెస్ట్ చేసింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఒడిశాలోని రూర్కెలా సమీపంలో టెస్టింగ్ సమయంలో కారు కనిపించింది.

నివేదికల ప్రకారం, XUV 3XO EV ఫుల్ ఛార్జ్‌పై 400 కిలోమీటర్ల పరిధిని అందించగలదు. ఈ వాహనం అంచనా ధర సుమారు రూ. 13-15 లక్షలు ఉండచ్చు. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. అయితే త్వరలోనే ఈ విషయం కూడా వెల్లడి కానుంది. మహీంద్రా XUV 3XO EV ఒక ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. భారత్‌లో ఇది టాటా నెక్సాన్ ఈవీతో పోటీపడుతుంది.

టెస్టింగ్ సమయంలో ఎక్స్‌యూవీ 3XO ఈవీ స్పై షాట్స్ బయటకు వచ్చాయి. అందులో ఈ వాహనం డిజైన్ స్పష్టంగా కనిపించింది. ముందు భాగంలో అదే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను రౌండ్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, C-సైజ్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో చూడచ్చు.బ్లాక్ రూఫ్ రెయిల్స్, ఓఆర్‌విఎమ్‌లు, షార్క్ ఫిన్ యాంటెన్నా డిజైన్‌గా ఇచ్చారు. ఇది కాకుండా 360-డిగ్రీ కెమెరా కూడా ఉంటుంది.

Mahindra XUV 3XO Features

మహీంద్రా XUV 3XO ఒక శక్తివంతమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ. దీని ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అందులో మంచి స్థలం అందుబాటులో ఉంది. 5 మంది సులభంగా కూర్చోవచ్చు. XUV 3XOలో 3 ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 21.2 km/l వరకు మైలేజీని అందిస్తుంది. భద్రతలో 5 స్టార్ రేటింగ్‌ సాధించింది.

Tags:    

Similar News