Mahindra : అదిరిపోయే లుక్, లగ్జరీ ఇంటీరియర్..మహీంద్రా స్కార్పియో-N పికప్ వచ్చేస్తోంది

అదిరిపోయే లుక్, లగ్జరీ ఇంటీరియర్..మహీంద్రా స్కార్పియో-N పికప్ వచ్చేస్తోంది

Update: 2026-02-14 04:31 GMT

Mahindra : మహీంద్రా ఆటోమోటివ్ తన పాపులర్ ఎస్‌యూవీ స్కార్పియో-N ఆధారంగా రూపొందిస్తున్న సరికొత్త లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 2023లో గ్లోబల్ పిక్ అప్ కాన్సెప్ట్‌గా పరిచయమైన ఈ వాహనం, ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్‌కు సిద్ధమవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన స్పై షాట్స్ బయటకు రావడంతో, కారు ఎక్స్‏టీరియర్‎తో పాటు ఇంటీరియర్ వివరాలు కూడా లీక్ అయ్యాయి. మహీంద్రా తన స్కార్పియో-N ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్న ఈ పికప్ ట్రక్ 2027లో గ్లోబల్ మార్కెట్‌లోకి రానుంది. కేవలం సరుకు రవాణాకే కాకుండా, అడ్వెంచర్ ఇష్టపడే వారి కోసం లగ్జరీ ఫీచర్లతో దీనిని రూపొందిస్తున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఫోటోలను బట్టి చూస్తే, ఇది స్కార్పియో-N ఎస్‌యూవీ కంటే కూడా మరింత పవర్‌ఫుల్ లుక్‌తో కనిపిస్తోంది.

స్కార్పియో-N పికప్ ఫ్రంట్ లుక్ దాదాపు ఎస్‌యూవీని పోలి ఉన్నప్పటికీ, కొన్ని కీలక మార్పులు చేశారు. ఇందులో కొత్తగా రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ మరియు ఆకర్షణీయమైన గ్రిల్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో డ్యూయల్ క్యాబిన్ డిజైన్‌తో పాటు వెనుక వైపు పెద్ద ట్రక్ బెడ్ (సరుకు ఉంచే చోటు) ఉంది. 18 అంగుళాల అలాయ్ వీల్స్ , భారీ క్లాడింగ్ దీనికి రగ్గడ్ లుక్ ఇస్తున్నాయి.

పికప్ ట్రక్ అంటే కేవలం లోపల సింపుల్‌గా ఉంటుందని అనుకుంటే పొరపాటే. లీక్ అయిన ఫోటోల ప్రకారం.. ఇందులో 10.25 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండబోతోంది. అలాగే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవల్-2 ADAS సేఫ్టీ ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లను మహీంద్రా జోడించనుంది.

ఈ పికప్ ట్రక్‌లో నమ్మకమైన 2.2 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్ వాడనున్నారు. ఇది సుమారు 172 bhp పవర్, 400 Nm కంటే ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ముఖ్యంగా ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం ఇందులో మహీంద్రా 4-ఎక్స్‌ప్లోర్ (4WD) సిస్టమ్ కూడా ఉండనుంది. మార్కెట్ అంచనాల ప్రకారం.. మహీంద్రా స్కార్పియో-N పికప్ ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది టయోటా హిలక్స్ (రూ.30 లక్షల - రూ.38 లక్షలు) కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుండటంతో గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News