Mahindra : ఏంటి మామ ఈ క్రేజ్..ఈ కారు కోసం షోరూమ్‌ల ముందు క్యూ కడుతున్న జనం

ఏంటి మామ ఈ క్రేజ్..ఈ కారు కోసం షోరూమ్‌ల ముందు క్యూ కడుతున్న జనం

Update: 2026-02-12 04:36 GMT

Mahindra : మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ 2026 ఏడాదిని అదిరిపోయే ఓపెనింగ్‌తో ప్రారంభించింది. కేవలం ఒక్క నెలలోనే రికార్డు స్థాయి విక్రయాలతో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తన హవాను చాటుకుంది. గతేడాదితో పోలిస్తే అమ్మకాల్లో భారీ వృద్ధిని సాధించడమే కాకుండా, తన ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనిస్తోంది. ముఖ్యంగా స్కార్పియో, థార్, బొలేరో మోడళ్లు కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మహీంద్రా సంస్థ 2026 జనవరి నెలలో మొత్తం 63,510 వాహనాలను విక్రయించింది. గతేడాది జనవరిలో (50,659 యూనిట్లు) అమ్మకాలతో పోలిస్తే ఇది 25.37% పెరుగుదల. కేవలం ఒక ఏడాదిలోనే ఇంతటి వృద్ధి సాధించడం విశేషం. ఇక డిసెంబర్ 2025 తో పోల్చినా దాదాపు 24.66 శాతం పెరుగుదల కనిపించింది. ఎస్‌యూవీల విభాగంలో మహీంద్రాకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఈ ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

మహీంద్రా మోడళ్లలో స్కార్పియో ఎప్పటిలాగే తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. జనవరిలో 15,542 యూనిట్ల విక్రయాలతో టాప్ లో నిలిచింది. అయితే అత్యధిక వృద్ధిని మాత్రం మహీంద్రా థార్ సాధించింది. గతేడాదితో పోలిస్తే థార్ విక్రయాలు ఏకంగా 77.56% పెరగడం గమనార్హం. థార్ రాక్స్ మార్కెట్లోకి రావడంతో ఈ మోడల్‌కు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా థార్ ఇప్పుడు స్టేటస్ సింబల్ గా మారిపోయింది.

గ్రామీణ ప్రాంతాల్లో బొలేరో హవా తగ్గడం లేదు. జనవరి నెలలో 11,841 బొలేరో కార్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది కంటే 36.39 శాతం ఎక్కువ. ఇక లగ్జరీ సెగ్మెంట్లో ఉన్న XUV7XO కూడా 10,133 యూనిట్ల విక్రయాలతో 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో XUV 3XO కూడా తన ఉనికిని చాటుకుంటూ 8,845 యూనిట్ల విక్రయాలను సాధించింది.

మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో మార్కెట్లోకి చొచ్చుకుపోతోంది. కొత్తగా వచ్చిన XEV 9e మోడల్ 1,945 యూనిట్ల విక్రయాలతో 71 శాతం వృద్ధిని చూసింది. అలాగే BE6 మోడల్ 1,028 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోతోంది. అయితే, పాత మోడల్ అయిన XUV400 అమ్మకాలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. కస్టమర్లు ఇప్పుడు పాత ఎలక్ట్రిక్ కార్ల కంటే మహీంద్రా నుండి వస్తున్న లేటెస్ట్ ఈవీ మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

Tags:    

Similar News