Mahindra XUV 3XO EV: మహీంద్రా నుంచి కొత్త ఎస్‌యూవీ.. త్వరలో లాంచ్..!

Mahindra XUV 3XO EV: భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ విభాగంలో టాటా, హ్యుందాయ్ తర్వాత ఇప్పుడు మహీంద్రా కూడా మరో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Update: 2025-02-24 09:22 GMT

Mahindra XUV 3XO EV: భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ విభాగంలో టాటా, హ్యుందాయ్ తర్వాత ఇప్పుడు మహీంద్రా కూడా మరో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. కంపెనీ త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఎక్స్‌యూవీ 3XOని విడుదల చేయబోతోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. ఈ ఏడాది చివరి నాటికి మహీంద్రా తన రాబోయే EVని విడుదల చేయగలదని ఆటో దిగ్గజాలు భావిస్తున్నాయి. కొత్త మహీంద్రా XUV 3XO EV ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, డ్రైవింగ్ రేంజ్ తదితర వివరాలు తెలుసుకుందాం.

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఈవీ డిజైన్ దాని ICE మోడల్ నుండి తీసుకొన్నారు. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సి-సైజ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, కనెక్ట్ చేసిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ముందు భాగంలో కొత్త అప్‌డేటెడ్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు ప్రత్యేకమైన పెయింట్ ఆప్షన్ అందించవచ్చు. దేశీయ మార్కెట్లో ఈ కారు టాటా పంచ్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీలతో పోటీపడుతుంది.

కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్యాబిన్ ఆకర్షణీయంగా, కొత్త సాంకేతికతతో ఉంటుంది. దీనిలో10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్‌తో పాటు భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి.

అంతే కాకుండా 7-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్, అడాస్ సేఫ్టీ సూట్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా టాప్ ఎండ్ వేరియంట్‌లో అందించనున్నారు.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 34.5 కిలోవాటట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌పై 400 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ డీజిల్ పెట్రోల్ మోడల్‌కు మార్కెట్లో అద్భుతమైన స్పందన లభిస్తోంది. మహీంద్రా చౌకైన ఎస్‌యూవీ కూడా ఇదే.

ఈ ఎస్‌యూవీ డీజిల్-పెట్రోల్ మోడల్ ధర రూ. 8 లక్షల నుండి రూ. 15.56 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది. 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 1.2-లీటర్ TGDI టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ స్టాండర్డ్ సేఫ్టీగా 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో వస్తుంది.

Tags:    

Similar News