Engine Cooling System: ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ల మధ్య తేడా ఏంటి..?
Engine Cooling System: కారైనా సరే బైక్ అయినా సరే ఇంజిన్‌తో పాటు కూలింగ్ సిస్టమ్ వస్తుంది.
Engine Cooling System: ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ల మధ్య తేడా ఏంటి..?
Engine Cooling System: కారైనా సరే బైక్ అయినా సరే ఇంజిన్‌తో పాటు కూలింగ్ సిస్టమ్ వస్తుంది. ఇంజిన్‌ను చల్లగా ఉంచడం దీని పని. ఇది ఇంజన్ టెంపరేచర్‌ను అదుపులో ఉంచుతుంది. వేర్వేరు ఇంజిన్లతో వేర్వేరు కూలింగ్ సిస్టమ్స్ వస్తాయి. బైక్‌లలో మూడు రకాల కూలింగ్ సిస్టమ్‌లు అందుబాటులో ఉన్నాయి ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఇవన్ని వాటి సొంత ప్రయోజనాలు, అప్రయోజనాలు కలిగి ఉంటాయి. అయితే ఏదీ చెడ్డది ఏది మంచిది అనేది బైక్ ఇంజిన్ అవసరాన్ని బట్టి ఉంటాయి. ఎయిర్ కూల్డ్, ఆయిల్ కూల్డ్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ల మధ్య తేడా ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.
ఎయిర్-కూల్డ్ ఇంజిన్
ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌లో ఇంజిన్ సిలిండర్లను కూల్ చేయడానికి గాలిని ఉపయోగిస్తారు. ఇంజిన్ సిలిండర్ల పైన, చుట్టూ ఫ్యాన్లు (రెక్కలు) ఉంటాయి. ఇవి ఇంజిన్ వైశాల్యాన్ని పెంచుతాయి. వేడిని సులభంగా తప్పించుకోవడానికి సిలిండర్ల చుట్టూ గాలి బాగా ప్రసరిస్తుంది. ఈ గాలి సిలిండర్ల నుంచి వేడిని గ్రహిస్తుంది.
ఆయిల్ కూల్డ్ ఇంజిన్
ఆయిల్ కూల్డ్ ఇంజిన్లలో సిలిండర్లను చల్లబరచడానికి ఇంజిన్ ఆయిల్ ఉపయోగిస్తారు. ఈ పద్దతిలో ఇంజిన్ ఆయిల్ సిలిండర్లలో ఉత్పన్నమయ్యే వేడిని గ్రహిస్తుంది. ఈ వేడి ఇంజిన్ ఆయిల్ రేడియేటర్‌కు చేరుకుంటుంది. రేడియేటర్‌లోని గాలి వల్ల చల్లబడి తిరిగి ఇంజిన్‌లోకి వస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈ విధంగా ఇంజిన్‌ని కూల్ చేస్తారు.
లిక్విడ్ కూల్డ్ ఇంజిన్
లిక్విడ్ కూల్డ్ ఇంజిన్లలో ఇంజిన్ సిలిండర్లను చల్లబరచడానికి ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది యాంటీఫ్రీజ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సిలిండర్ల నుంచి వేడిని గ్రహించి ఇంజిన్‌ను చల్లగా ఉంచుతుంది. ఇది కూలింగ్ సిస్టమ్‌లో అత్యంత ప్రభావవంతమైంది. ఇది సాధారణంగా పెద్ద ఇంజిన్లలో ఈ సిస్టమ్ ఇస్తారు.