Kia Seltos : ఆరు లక్షల మంది మెచ్చిన సూపర్ కారు..ఫీచర్లు చూస్తే మీరూ ఒకటి కొనాలని ఆశ పడతారు
ఆరు లక్షల మంది మెచ్చిన సూపర్ కారు..ఫీచర్లు చూస్తే మీరూ ఒకటి కొనాలని ఆశ పడతారు
Kia Seltos : కియా ఇండియా గ్యారేజీలో సరికొత్త రికార్డు నమోదైంది. ఆ సంస్థకు చెందిన పాపులర్ మిడ్-సైజ్ SUV సెల్టోస్ దేశీయ మార్కెట్లో దుమ్మురేపుతోంది. 2019లో భారత్‌లోకి అడుగుపెట్టిన ఈ కారు, అతి తక్కువ కాలంలోనే 6 లక్షల విక్రయాల మైలురాయిని అధిగమించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మిడ్ SUV సెగ్మెంట్‌లో సెల్టోస్‌కు ఉన్న తిరుగులేని క్రేజ్‌కు ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ మంగళవారం ప్రకటించింది. విశేషమేమిటంటే.. మొత్తం విక్రయాల్లో సుమారు 29 శాతం వాటా కేవలం టాప్ వేరియంట్లదే ఉండటం గమనార్హం. దీన్ని బట్టి భారతీయ వినియోగదారులు ఇప్పుడు కేవలం కారు మాత్రమే కాకుండా, అందులో ఉండే హై-టెక్ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ, కనెక్టెడ్ టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అటు ఎంట్రీ లెవల్ నుంచి ఇటు ప్రీమియం వేరియంట్ల వరకు సెల్టోస్ అన్ని వర్గాల కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యం ఉండటం ఈ కారుకు ప్లస్ పాయింట్‌గా మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా కియా తన సెల్టోస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం వస్తున్న మోడళ్లలో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటివి ఈ ఎస్యూవీని సెగ్మెంట్ లీడర్‌గా నిలబెట్టాయి.
ఈ ఘనతపై కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ సన్‌హాక్ పార్క్ స్పందిస్తూ.. "6 లక్షల మార్కును చేరడం అనేది కస్టమర్లకు మా డిజైన్, పర్ఫార్మెన్స్‌పై ఉన్న నమ్మకానికి గుర్తు" అని ఆనందం వ్యక్తం చేశారు. కొత్త సెల్టోస్ మరింత పొడవుగా (4,460 మిమీ), విశాలమైన వీల్‌బేస్‌తో వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని ఇస్తోంది. సిటీ రోడ్ల నుంచి హైవేల వరకు సెల్టోస్ ప్రయాణం ఇప్పుడు మరింత సురక్షితం, స్మార్ట్‌గా మారిందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.