Jeep Meridian Track Edition : జీప్ నుంచి పవర్‌ఫుల్ 4x4 ఎస్‌యూవీ.. ఫార్చ్యూనర్‌కు చుక్కలే

జీప్ నుంచి పవర్‌ఫుల్ 4x4 ఎస్‌యూవీ.. ఫార్చ్యూనర్‌కు చుక్కలే

Update: 2026-02-17 04:07 GMT

Jeep Meridian Track Edition :లగ్జరీ ఎస్‌యూవీ కార్ల తయారీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీప్ ఇండియా, మార్కెట్లోకి సరికొత్త అస్త్రాన్ని వదిలింది. తన పాపులర్ మోడల్ మెరిడియన్‌లో ట్రాక్ ఎడిషన్ పేరుతో ఒక లిమిటెడ్ ఎడిషన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధరను రూ.35.95 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించగా, అదిరిపోయే 4×4 వెర్షన్ ధర రూ.37.82 లక్షలుగా ఉంది. టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా జీప్ ఈ కొత్త వేరియంట్‌ను తీర్చిదిద్దింది.

ఈ ట్రాక్ ఎడిషన్‌లో చేసిన అతిపెద్ద మార్పు కారు లోపల సెకండ్ రో సీట్లలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీట్లను 140 మి.మీ వరకు ముందుకు, వెనుకకు జరుపుకోవచ్చు. దీనివల్ల మూడో వరుసలో కూర్చునే వారికి కావలసినంత లెగ్ రూమ్ దొరుకుతుంది, అలాగే లోపలికి వెళ్లడం, బయటకు రావడం మరింత సులభమవుతుంది. కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే కంపెనీ ఈ సౌకర్యాన్ని కల్పించింది. డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌తో పాటు కారు లోపల అక్కడక్కడా ట్రాక్ ఎడిషన్ బ్యాడ్జింగ్‌ను ఇచ్చి మరింత రిచ్ లుక్ ఇచ్చారు.

బయటి నుంచి చూస్తే ఈ కారు మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తోంది. గ్రిల్ దగ్గర పియానో బ్లాక్ ఫినిషింగ్, 18 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కారుకు మంచి రాజసాన్ని అద్దాయి. బోనెట్ మీద ప్రత్యేకమైన డీకల్స్, న్యూట్రల్ గ్రే యాక్సెంట్స్‌తో ఈ ఎడిషన్ పాత మెరిడియన్ కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇది మెరిడియన్ ఓవర్‌ల్యాండ్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది.

ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఎలాంటి కొరత లేదు. 10.1 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా సేఫ్టీ కోసం ఇందులో లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లను కూడా జోడించారు. ఇది డ్రైవింగ్ సమయంలో ప్రమాదాలను పసిగట్టి డ్రైవర్‌ను అలర్ట్ చేస్తుంది.

ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులో నమ్మకమైన 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను వాడారు. ఇది 170 hp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ కారు 2WD, 4WD (ఆల్ వీల్ డ్రైవ్) ఆప్షన్లలో అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ కారు టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్, స్కోడా కొడియాక్ వంటి కార్లతో తలపడనుంది.

Tags:    

Similar News