Kia India : కియా షోరూంలో ఆఫర్ల వర్షం..ఏకంగా రూ.2 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం

కియా షోరూంలో ఆఫర్ల వర్షం..ఏకంగా రూ.2 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం

Update: 2026-01-28 07:00 GMT

Kia India : కొత్త కారు కొనాలనుకునే వారికి కియా ఇండియా అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది. కియా సోనెట్, సెల్టోస్, లేదా లగ్జరీ కార్నివాల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే జనవరి 2026 లో ఈ కార్లపై ఏకంగా రూ.2 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 2025లో తయారైన స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ అదిరిపోయే ఆఫర్లను ఇస్తోంది. ఈ ఆఫర్లు కేవలం జనవరి 31, 2026 వరకు మాత్రమే వర్తిస్తాయి.

కారు కొనడం అనేది ప్రతి సామాన్యుడి కల. అలాంటి కలని మరింత సులభతరం చేస్తూ కియా మోటార్స్ తన ఫేమస్ కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. సాధారణంగా కొత్త ఏడాది ప్రారంభంలో కంపెనీలు పాత స్టాక్‌ను వదిలించుకోవడానికి ఇలాంటి ఆఫర్లు ఇస్తుంటాయి. అయితే ఈసారి కియా కేవలం పాత స్టాక్ (2025 మోడల్స్) పైనే కాకుండా, సరికొత్త 2026 మోడల్ కార్లపై కూడా గణనీయమైన డిస్కౌంట్లను ఇస్తోంది. ఈ ఆఫర్లలో క్యాష్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలిసి ఉన్నాయి.

మోడల్ వారీగా లభించే భారీ తగ్గింపులు ఇవే:

కియా కార్నివాల్ : కియా కార్లలోనే అత్యంత లగ్జరీ మోడల్ అయిన కార్నివాల్‌పై అత్యధికంగా రూ.2 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్ వాటానే రూ.1.5 లక్షల వరకు ఉండటం విశేషం. 2026 మోడల్‌పై కూడా రూ.1.78 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

కియా సెల్టోస్ : ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ పాత మోడల్ (2025) పై రూ.1.45 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. ఒకవేళ మీరు కొత్త 2026 మోడల్ కావాలనుకుంటే దానిపై కూడా రూ.79,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.

కియా సైరోస్ : ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన సైరోస్ 2025 మోడల్‌పై రూ.1,05,000 వరకు, 2026 మోడల్‌పై రూ.69,000 వరకు డిస్కౌంట్ ఉంది.

కియా కేరెన్స్ : ఫ్యామిలీ ఎంపీవీ కేరెన్స్‌పై మోడల్‌ను బట్టి రూ.61,000 నుంచి రూ.68,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

కియా సోనెట్: కియా బెస్ట్ సెల్లర్ సోనెట్‌పై పాత స్టాక్‌పై రూ.66,000, కొత్త స్టాక్‌పై రూ.44,000 వరకు తగ్గింపు లభిస్తోంది.

ఈ తగ్గింపులు నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యతను బట్టి మారవచ్చు. కాబట్టి కారు బుక్ చేసే ముందు మీ సమీపంలోని కియా డీలర్‌ను సంప్రదించి ఫైనల్ ప్రైస్ చెక్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్ (పాత కారు తుక్కుగా మార్చినప్పుడు ఇచ్చే రాయితీ) ద్వారా మరికొంత అదనపు లాభం పొందే అవకాశం కూడా ఉంది. ఈ ఆఫర్ జనవరి 31తో ముగియనుంది, కాబట్టి ఆలస్యం చేయకుండా షోరూమ్‌కు వెళ్లడం ఉత్తమం.

Tags:    

Similar News