Kia Carens Clavis EV: మార్కెట్లోకి పవర్ ఫుల్ ఈవీ.. కియా క్లావిస్ వచ్చేస్తోంది.. హ్యుందాయ్, టాటాకు దిమ్మతిరిగిపోతుంది..!

Kia Carens Clavis EV: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ దృష్ట్యా, వాహన తయారీదారులు అనేక విభాగాలలో ఈవీలను పరిచయం చేసి విడుదల చేస్తున్నారు.

Update: 2025-05-27 11:30 GMT

Kia Carens Clavis EV: మార్కెట్లోకి పవర్ ఫుల్ ఈవీ.. కియా క్లావిస్ వచ్చేస్తోంది.. హ్యుందాయ్, టాటాకు దిమ్మతిరిగిపోతుంది..!

Kia Carens Clavis EV: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ దృష్ట్యా, వాహన తయారీదారులు అనేక విభాగాలలో ఈవీలను పరిచయం చేసి విడుదల చేస్తున్నారు. కియా త్వరలో కియా కేరెన్స్ క్లావిస్‌ను కొత్త ఈవీగా పరిచయం చేయవచ్చు. దానిలో ఎలాంటి ఫీచర్లు ఉండచ్చు, రేంజ్ ఎలా ఉండొచ్చు, కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ ఎప్పుడు లాంచ్ అవుతుంది, తదితర వివరాలు తెలుసుకుందాం.

Kia Carens Clavis EV Launch Date

కియా నుండి కేరెన్స్ క్లావిస్ అధికారికంగా 23 మే 2025న భారత మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తయారీదారు దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని జూలై నుండి సెప్టెంబర్ 2025 మధ్య ప్రవేశపెట్టవచ్చని, డెలివరీ తరువాత ప్రారంభించవచ్చని భావిస్తున్నారు.

Kia Carens Clavis EV Features

కియా నుండి వచ్చిన కేరెన్స్ క్లావిస్ ఈవీ దాని ICE వెర్షన్ మాదిరిగానే రూపొందించారు. కానీ దాని ముందు గ్రిల్‌లో కొన్ని మార్పులు చేయవచ్చు. దీనితో పాటు ఎమ్‌పీవీ ICE వేరియంట్ లాగానే అదే గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైట్లు, మూడు వరుస సీట్లు, లెవల్-2 అడాస్ ఉన్నాయి.

Kia Carens Clavis EV Range

దీని గురించి తయారీదారు ఇంకా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు, కానీ దీనిలో 55 నుండి 60 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీని అందించవచ్చని భావిస్తున్నారు. దీని కారణంగా ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇది కాకుండా, ఒకటి కంటే ఎక్కువ బ్యాటరీ ఎంపికలతో కూడా విడుదల చేయచ్చు. కానీ అందులో మోటారు ఒక ఆప్షన్ మాత్రమే ఉంటుంది.

Kia Carens Clavis EV Price

కియా కేరెన్స్ క్లావిస్ ఈవీ ఖచ్చితమైన ధర విడుదల సమయంలో మాత్రమే తెలుస్తుంది. కానీ దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 18 లక్షలు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.

కియా ఎలక్ట్రిక్ ఎమ్‌పివి విభాగంలో కేరన్స్ క్లావిస్ ఈవీని అందించనుంది. ఇది ఈ విభాగంలో ఏ ఎలక్ట్రిక్ ఎమ్‌పివి తోనూ నేరుగా పోటీ పడదు, కానీ ధర పరంగా, ఇది ఎం.జీ విండ్సర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీ వంటి ఎస్‌యూవీల నుండి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. దీనితో పాటు, ఇది త్వరలో విడుదల కానున్న టాటా హారియర్ ఈవీ, మారుతి ఈ విటారా వంటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో కూడా పోటీ పడనుంది.

Tags:    

Similar News