Kia Carens Clavis EV: మారుతి ఎర్టిగాకు చెక్.. కియా నుంచి తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు!
Kia Carens Clavis EV: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా గత నెలలోనే తమ కారెన్స్ క్లావిస్ మోడల్‌ను భారతదేశంలో రూ.11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసిన విషయం తెలిసిందే.
Kia Carens Clavis EV: మారుతి ఎర్టిగాకు చెక్.. కియా నుంచి తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు!
Kia Carens Clavis EV: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా గత నెలలోనే తమ కారెన్స్ క్లావిస్ మోడల్‌ను భారతదేశంలో రూ.11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు, ఈ పాపులర్ MPV ఫుల్లీ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్‌లు భారతదేశంలో మొదలయ్యాయి. ఇటీవల క్లావిస్ EV క్యామోఫ్లేజ్ లుక్‌తో , ఎర్రటి నంబర్ ప్లేట్‌తో ఏపీలో టెస్టింగ్ సమయంలో కనిపించింది.
క్లావిస్ ఈవీ భారత మార్కెట్ కోసం కియా మొట్టమొదటి మాస్-మార్కెట్ ఈవీ కానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్లావిస్ ఈవీలో రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. 42kWh బ్యాటరీతో పాటు 135hp మోటార్ ఉంటుంది. ఇది దాదాపు 390 కి.మీ.ల రేంజ్ను అందిస్తుంది. 51.4kWh బ్యాటరీతో పాటు 171hp మోటార్ ఉంటుంది. ఇది సుమారు 473 కి.మీ.ల రేంజ్ను అందిస్తుందని అంచనా. ఈ భారీ రేంజ్ ప్రయాణికులకు ఆందోళన లేకుండా సుదూర ప్రయాణాలకు వెళ్లే అవకాశం కల్పిస్తుంది.
డిజైన్ పరంగా క్లావిస్ ఈవీలో క్లోజ్డ్ గ్రిల్, కొత్త ఏరో అల్లాయ్ వీల్స్, LED DRLలు, ట్రిపుల్-పాడ్ హెడ్‌ల్యాంప్స్ వంటి స్టైలింగ్ ఫీచర్లు కనిపించనున్నాయి. అయితే, దీని మొత్తం బాడీ ప్రస్తుత ఐసీఈ మోడల్ (పెట్రోల్/డీజిల్) లాగే ఉండే అవకాశం ఉంది.ఇంటీరియర్ లోపలి భాగంలో, 26.62 అంగుళాల డ్యూయల్ పనోరమిక్ డిస్‌ప్లే, ముందు వైపు వెంటిలేటెడ్ సీట్లు, BOSE 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు లభించనున్నాయి. ఇవి కారు లోపల లగ్జరీ ఎక్స్ పీరియన్స్ అందిస్తాయి.
సేఫ్టీ విషయంలో క్లావిస్ ఈవీలో లెవెల్-2 ADAS, 360 డిగ్రీ కెమెరా, డ్యూయల్ కెమెరా డాష్‌క్యామ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్ వంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. కియా ఈ ఈవీలో V2L (Vehicle-to-Load) అంటే కారు నుంచి ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ సరఫరా చేసే సదుపాయం, V2V (Vehicle-to-Vehicle) ఛార్జింగ్ సదుపాయం కూడా ఇవ్వనుంది.
కియా క్లావిస్ ఈవీ వచ్చే నెల్లో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది భారత ఈవీ మార్కెట్‌లో కొత్త, ప్రీమియం ఆప్షన్ అని నిరూపించుకోవచ్చు. ఇది మొట్టమొదటి 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు కానుందని అంచనా. ఈ కారు మార్కెట్‌లోకి వస్తే మారుతి సుజుకి ఎర్టిగా వంటి ఎమ్‌పివిలకు, టయోటా ఇన్నోవా వంటి ప్రీమియం ఎమ్‌పివిలకు కూడా గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.