వాహనదారులకి అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నియమం అమలు..!

Vehicle Scrap Policy: వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు వాటి ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం 'వెహికల్ స్క్రాప్ పాలసీ'ని ప్రవేశపెట్టింది.

Update: 2023-01-21 10:30 GMT

వాహనదారులకి అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నియమం అమలు..!

Vehicle Scrap Policy: వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు వాటి ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం 'వెహికల్ స్క్రాప్ పాలసీ'ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో దేశంలోని 15 ఏళ్లు పైబడిన వాహనాలని చెత్తకుప్పలకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పటిష్టంగా అమలవుతుంది.

ప్రస్తుతం ఏయే వాహనాలను రద్దు చేయబోతున్నారో ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. స్క్రాప్ కోసం పంపిన వాహనాలు రీసైకిల్ చేస్తారు. దీని నుంచి మెటల్, రబ్బరు, గాజు మొదలైన వస్తువులు సేకరిస్తారు. వీటిని వాహనాల తయారీలో మళ్లీ ఉపయోగిస్తారు. నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి దేశంలోని 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలన్నీ జంక్‌గా మారుతాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 15 ఏళ్లు పైబడిన వాహనాలు, రవాణా సంస్థలకు చెందిన బస్సులు, ప్రభుత్వ సంస్థల వాహనాలు ఉంటాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 15 ఏళ్లు దాటిన వాహనాలు, రవాణా సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల పాత బస్సుల రిజిస్ట్రేషన్‌ను ఏప్రిల్‌ 1 నుంచి రద్దు చేస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. రక్షణ, శాంతిభద్రతలు, అంతర్గత భద్రత, నిర్వహణ తదితర పనుల్లో నిమగ్నమైన వాహనాలకు స్క్రాప్‌కు పంపాలన్న నిబంధన వర్తించదని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. వీటిలో సాయుధ ఇతర ప్రత్యేక వాహనాలు ఉన్నాయి.

ఈ చట్టం ప్రకారం రిజిస్టర్డ్ వాహనాలను స్క్రాప్‌కు పంపే పని దేశవ్యాప్తంగా తెరిచిన రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ సెంటర్ల ద్వారా జరుగుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం వాహనాల స్క్రాప్ విధానాన్ని ప్రకటించింది. ఇందులో ప్రైవేట్ వాహనాలకు 20 ఏళ్ల తర్వాత, కమర్షియల్ వాహనాలకు 15 ఏళ్ల తర్వాత ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ పరీక్షలో క్లియర్ అయిన తర్వాతే వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ అవుతుంది. ఈ విధానం దేశంలో ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ విధానం ప్రకారం మీ వాహనాలు ఏదైనా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో స్క్రాప్‌కు పంపబడి దాని స్థానంలో కొత్త వాహనం తీసుకున్నట్లయితే 25 శాతం వరకు రహదారి పన్ను మినహాయింపు లభిస్తుంది.

Tags:    

Similar News